- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మిలటరీ కాలేజీ లో ఘనంగా స్నాతకోత్సవ వేడుకలు...హాజరైన గవర్నర్
దిశ,కంటోన్మెంట్/బోయిన్ పల్లి : సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (MCEME)లో 102వ స్నాతకోత్సవం సందర్భంగా గురువారం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరై 36 మంది ఇంజనీరింగ్ అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. DE-103, టెక్నికల్ ఎంట్రీ కోర్సులను సికింద్రాబాద్ తిరుమలగిరి లో MCEMEలో ఈ వేడుకలు జరిగాయి. సాయుధ దళాల సీనియర్ అధికారులతో సహా పలువురు సీనియర్ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి ద్వారా అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ శిక్షణను సజావుగా నిర్వహించినందుకు ఉపాధ్యాయులను , సిబ్బందిని విద్యార్థులను గవరన్నర్ అభినందించారు. లెఫ్టినెంట్ జనరల్ జేఎస్. సిదానా మాట్లాడుతూ కమాండెంట్లు, గ్రాడ్యుయేట్ ఆఫీసర్లు కఠినమైన అకడమిక్ని ఎదుర్కొని సాంకేతిక సవాళ్ల పై నిరంతరం అవగాహన కలిగి ఉండాలని సూచించారు.