ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వం లక్ష్యం: మంత్రి మల్లారెడ్డి

by Kalyani |
ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వం లక్ష్యం: మంత్రి మల్లారెడ్డి
X

దిశ, మేడ్చల్ టౌన్: మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని 18వ వార్డు, 9వ వార్డు (గిర్మాపూర్) లలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపిక నర్సింహా రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు పాలకుర్తి భవాని రాఘవేందర్ గౌడ్, వంగేటి లావణ్య హనుమంత్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని చేరువ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ దవాఖానాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని అన్నారు. బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసే పథకాలే ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నాయని తెలిపారు. బస్తీ దవఖానాలు, పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంతో పాటు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు.

కే‌సీ‌ఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయని కొనియాడారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి 11 వ వార్డులో వైకుంటదామం, 16 వ వార్డులో సీసీ రోడ్లను స్థానిక వార్డుల కౌన్సిలర్లు పానుగంటి సుహాసిని, నడికొప్పు ఉమా నాగరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ టి‌ఎస్‌వి‌ఎన్ త్రిల్లేశ్వర్ రావు, కౌన్సిలర్లు తుడుం గణేశ్, మణికంఠ గౌడ్, బత్తుల శివ కుమార్ యాదవ్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, జంగ హరికృష్ణ యాదవ్, కౌడే మహేశ్, గర్మపుర్ బిఅర్ఎస్ మాజీ గ్రామ అధ్యక్షుడు బి. మోహన్ రెడ్డి, కోె ఆప్షన్ మెంబర్లు మహబూబ్ అలీ, నాయకులు మర్రి నర్సింహా రెడ్డి, శేకర్ గౌడ్ , రాఘవేందర్ గౌడ్,శ్రవణ్ కుమార్ గుప్తా, రవీందర్, మధుకర్ యాదవ్, నడికొప్పు నాగరాజు, సాటే నరేందర్, సత్యనారాయణ, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed