రైతులకు మద్దతుగా వచ్చా.. టీఆర్‌ఎస్ దీక్షలో గద్దర్

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-04 07:11:01.0  )
రైతులకు మద్దతుగా వచ్చా.. టీఆర్‌ఎస్ దీక్షలో గద్దర్
X

దిశ ప్రతినిధి,మేడ్చల్ /అల్వాల్: వడ్లు కొనాల్సిందేనని టీఆర్ఎస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు మండల కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. రైతుల ఆకాంక్షల మేరకు రాజకీయాలను పక్కన బెట్టి కేంద్రమే వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అల్వాల్ మండల రెవెన్యూ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన దీక్షలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పాల్గొన్నారు. ఇదే దీక్షలో ప్రముఖ గాయకులు యుద్ధనౌక గద్దర్ పాల్గొని నిరసన దీక్షకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందేనన్నారు. లేదంటే ఆందోళనలను తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. గద్దర్ మాట్లాడుతూ.. ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనన్నారు. రైతుల బాధలను చూడలేకనే నిరసన దీక్షలో పాల్గొన్నట్లు గద్దర్ తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story