- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
జ్యువెలరీ షాపులలో.. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్!
దిశ, కుత్బుల్లాపూర్: జ్యువెలరీ షాప్స్ లలో మైండ్ డైవర్డ్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను గురువారం జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో జరిగింది. బాలానగర్ ఏసీపీ హనుమంతు రావు తెలిపిన వివరాలు ప్రకారం బొజ్జగాని దీనమ్మ, బొజ్జగాని నాగేంద్రమ్మ, వెంకట రమణమ్మ, బాలసాని అశోక్, బొజ్జగాని జ్ఞానమ్మ, బాలసాని వెంకటపతి లు ఖమ్మం జిల్లా, మధిర మండలం వాస్తవ్యులు. ఒకే జిల్లా ఒకే మండలంకు చెందిన వీరందరు వరుసకు చుట్టాలే. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ చుట్టాల టీం హైదరాబాద్ నగరంలో ఎంట్రీ ఇచ్చి జ్యువెలరీ దుకాణాలను దోచుకెళ్లేందుకు నేరస్తులుగా జట్టు కట్టారు. రెండు టీంలుగా బయలుదేరి జ్యువెలరీ షాప్ లలో నగలను దొంగలించేందుకు పథకం రచిస్తారు. మొదట జ్యువెలరీ షాప్స్ లో కస్టమర్స్ గా ఎంట్రీ అవుతారు. అది కొనాలి... ఇది కొనాలి... ఇది చూపు... అది చూపు అంటూ కొనే వారిలాగా బిల్డప్ ఇస్తారు. తీరా జ్యువెలరీ షాప్ యజమానిని మాటల్లో పెట్టి, ఆ నగ తీసుకో... ఈ నగ డిజైన్ బాగుంది అంటూ హడావిడి చేసి షాప్ కీపర్ అటెన్షన్ డైవర్ట్ చేసి బంగారు నగలు కొట్టేసి... నకిలీ నగలు వాటి ప్లేస్ లో ఉంచుతారు. ఇలా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో మూడు దొంగతనాలను, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఒకటి, రాచకొండ కమిషనరేట్ పరిధిలో గల చైతన్య పురి పోలీస్ స్టేషన్ లో ఒకటి చొప్పున జ్యువెలరీ షాప్ లలో దొంగతనాలు చేసి 60 గ్రాముల బంగారం దోచుకున్నారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో వరుసగా మూడు కేసులు జ్యువెలరీ షాప్స్ లలో దొంగతనం అయ్యినట్లు ఫిర్యాదులు రావడంతో జగద్గిరిగుట్ట పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. సైబరాబాద్ క్రైమ్ డీసీపీ, బాలానగర్ జోన్ డీసీపీ ఆదేశాల మేరకు పలు జ్యువలరీ షాప్స్ సీసీ టీవీ పుటేజీలు పరిశీలించారు.
ముఠా సభ్యులు సీసీ టీవీ లో వారి నైపుణ్యం ప్రదర్శించిన తీరు బయటపడడంతో.. తరచూ జరిగే దొంగతనాలకు పోలీసులు చెక్ పెట్టారు. బొజ్జగాని దీనమ్మ, బొజ్జగాని నాగేంద్రమ్మ, వెంకట్ రవణమ్మ, బాలసాని అశోక్ లను అరెస్ట్ చేయగా బొజ్జగాని జ్ఞానమ్మ, బాలసాని వెంకటపతి లు పరారీలో ఉన్నారు. వారి నుండి క్రైమ్ కు ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్నారు. కేసును చేదించిన జగద్గిరిగుట్ట సీఐ క్రాంతి కుమార్ ను, క్రైమ్ బ్రాంచ్ పోలీసులను బాలానగర్ డీసీపీ, సైబరాబాద్ క్రైమ్ డీసీపీ లు అభినందించారు.