- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దివ్యాంగుల సాధికారతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
దిశ, తిరుమలగిరి : దివ్యాంగుల సాధికారతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మారేడుపల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన దివ్యాంగుల సాధికారిత కార్యక్రమంలో దివ్యాంగులకు అవసరమైన సహాయ పరికరాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా డివిజన్ లోని 202 మంది అర్హులైన దివ్యాంగులను గుర్తించి దాదాపు 18 లక్షల రూపాయల విలువ చేసే సహాయక పరికరాలను ఎమ్మెల్యే పంపణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల సాధికారిత కోసం ఎంతో కృషి చేస్తుందని, అర్హులైన దివ్యాంగులను గుర్తించి వారికి ట్రై సైకిల్, వీల్ చైర్, హియరింగ్ ఎయిడ్ లాంటి 19 రకాల పరికరాలను అందిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాల సమయంలో ప్రతిపక్షాలు అర్థం లేని అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాయని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని అనేక అభివృద్ధి పనులను ఏడాదిలోనే కాంగ్రెస్ సర్కారు చేసి చూపిస్తుందని అన్నారు. ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో లేకుండా నియంతలా వ్యవహరించే వారని, నేటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నారని అన్నారు. బీజేపీ గతంలో నల్లధనం తీసుకువచ్చి ప్రజల ఎకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తామని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చేసిన హామీ నెరవేర్చారా అని, దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కంటోన్మెంట్ ఏరియాలో గత 5 ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ మెంబర్లతో నెట్టుకొస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అన్నారు. రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించే ముందు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఎన్ని నిధులు తీసుకువచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్, జీహెచ్ఎంసీ డిప్యూటీ జోనల్ కమిషనర్ సమ్మయ్య, స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక తదితరులు పాల్గొన్నారు.