- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పూర్తిస్థాయిలో పార్టీ బలోపేతానికి కసరత్తు..: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
దిశ, తిరుమలగిరి : పార్టీ జాతీయ నాయకత్వ అధిష్టానం పిలుపుమేరకు సంస్థాగత ఎన్నికల వర్క్ షాప్ జరుపుకుంటున్నామని కేంద్ర మంత్రి రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీలో సంస్థాగత ఎన్నికల హడావుడి మొదలైంది.బూత్ లెవల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్తగా కమిటీలు వేసేందుకు పార్టీ షెడ్యూల్ ఖరారు చేసింది.ఇందులో భాగంగా గురువారం సికింద్రాబాద్ లోని డైమండ్ పాయింట్ లోని రాజరాజేశ్వరి గార్డెన్ లో గురువారం బిజెపి రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు పార్టీ జాతీయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షులు ఎంపీ డీకే అరుణ,జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్,ఎంపీలు ఈటెల రాజేందర్,కొండా విశ్వేశ్వర్ రెడ్డి,బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీలు,ఎమ్మెల్యేలు,స్టేట్ ఆఫీస్ బేరర్లు,జాతీయ,రాష్ట్ర నేతలు,అనుబంధ సంఘాల స్టేట్ ప్రెసిడెంట్లు,జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు,జిల్లాల ఎన్నికల అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతు రాష్ట్ర వ్యాప్తంగా 50లక్షల సభ్యత్వాలు నమోదు చేయించాలని నేతలకు సూచించారు.ఇప్పటి వరకు సుమారు 31లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని,వీటిలో యాక్టివ్ మెంబర్ షిప్ లెక్కలు తీసుకున్నారని తెలిపారు.ఈ క్రమంలోనే కమిటీలు వేసేందుకు కసరత్తు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతానికి ఉపయోగపడేలా కమిటీల కోసం కొన్ని రోజులలో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. పార్టీ కమిటీల ఏర్పాటును కీలకంగా తీసుకోవడానికి,పార్టీ బలోపేతానికి ఉపయోగపడేలా కమిటీలు వేయాలని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ఈనెల 8,9,10 తేదీల్లో జిల్లా స్థాయిల్లో వర్క్ షాపులు పెట్టాలని పార్టీ అధిష్టానం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.పార్టీ బలోపేతానికి కొత్తతరం అవసరమని జాతీయ అధ్యక్షుడు కోసం ప్రజానీకం ఎదురుచూస్తుందని అన్నారు.ఈ నెల 15 వరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందని,నూటికి 90 శాతం మంది బీజేపీ వైపే చూస్తున్నారని అన్నారు.ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి గ్రామస్థాయి,పోలింగ్ బూత్ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకుని,ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టే పార్టీ బిజెపి నే అన్నారు.ఇప్పటివరకు 31 లక్షల మందిని సభ్యత్వ నమోదు చేయించడం గర్వించదగ్గ విషయమన్నారు.దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్న రాష్ట్రాలలో ఏ పథకాలు అమలుకావడం లేదని,ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు తప్ప ఏది చేయడం లేదన్నారు.కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను అరికట్టెందుకు ఉద్యమానికి రూపకల్పన చేయాలనీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.రానున్న రోజులలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలంటే సంస్థాగతంగా పార్టీ పటిష్టంగా ఉండాలని,ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలన్నారు.
గత ఎంపీ ఎన్నికలలో జనం మనవైపు చూసారని,కెసిఆర్ కుటుంబ సభ్యులపైన ప్రజలకు విశ్వాసం పోయిందన్నారు.పోతే కాంగ్రెస్ పార్టీపై నెలల వ్యవధిలోనే రాష్ట్ర ప్రజలలో వ్యతిరేకత వస్తుందని అన్నారు.ప్రజల పక్షనా నిలబడి కాంగ్రెస్ పార్టీ పై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.ఇప్పటివరకు ఉమ్మడి ఆదిలాబాద్,రంగారెడ్డి,హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మంత్రి వర్గంలో చోటు లేదని,దీంతో ఆయా జిల్లాలలో నెలకొన్న సమస్యలు పట్టించుకునేవారు లేరు అన్నారు.ఆదిలాబాద్ జిల్లాకు సితక్క వస్తే వారితో సమస్యలు చెప్పే పరిస్థితి లేదని,ఒక ఎమ్మెల్యే ఫారెస్ట్ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వం నుండి స్పందన కరువైంది అన్నారు.సంవత్సరం కావస్తున్నా మంత్రి వర్గం పూర్తిస్థాయిలో ఏర్పాటు కాకపోవడంలో ఏమనుకోవాలని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సర్వేలు ఎవరికోసం ఎందుకోసమని అన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన 6గ్యారెంటీలు ఎక్కడ అని అన్నారు.నేటివరకు రుణమాఫీ సగం మందికి కూడా కాలేదని,రూ.4 వేల నిరుద్యోగ భృతి ఎక్కడ పోయిందన్నారు.ఇందిరమ్మ కమిటీ అని వేసి ప్రధానమంత్రి ఆవాస యోజన తో నిర్మిస్తున్న ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెట్టడం సరైనదేనా అని అన్నారు.కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకుంటే రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుమీద లక్షల కోట్లు దోచుకుంటున్నారు.ఇలాంటి దోపిడీలను బీజేపీ అడ్డుకుంటుంది కానీ అభివృద్ధిని కాదని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి ఎంపి లు ఎమ్మెల్యేలు,జిల్లా మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.