- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గుండా గిరికి భయపడం : మర్రి
దిశ ప్రతినిధి,మేడ్చల్: సూట్ కేసులు తీసుకుని టికెట్లు కొనుగోలు చేసిన వ్యక్తులకు భయపడేది లేదని మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మల్కాజిగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు.మల్కాజిగిరిని ఇతర నియోజకవర్గాలకు మోడల్ గా తీర్చిదిద్దుతానన్నారు. ఇక మీదట మల్కాజిగిరిలో గుండాగిరి చెల్లదని,ధీటుగా ఎదుర్కొంటామని మర్రి హెచ్చరించారు. మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్దికి నోచుకోలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ.. మర్రి రాజశేఖర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకొని, మల్కాజిగిరి అభివృద్ధి కి దోహదపడాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమ కారుడు బద్దం పరశురామిరెడ్డి మాట్లాడుతూ.. ఓర్వలేక కొందరు బీఆర్ఎస్ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని, డబ్బులు తీసుకుని కార్పొరేటర్లు పనిచేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్న కార్పొరేటర్లు, లీడర్లపై బురదజల్లితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో కార్పొరేటర్లు సునీత రాము యాదవ్,జవహర్ నగర్ కార్పొరేటర్ ఏకే మురుగేష్, మాజీ కార్పొరేటర్ శిరీష జితేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు బద్దం పరశురామిరెడ్డి, ఉపేందర్ రెడ్డి, డోలి రమేశ్, అమీనుద్దిన్, రాము యాదవ్, పరమేశ్, శ్రీనివాస్ గౌడ్, విజయకుమారి, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.