- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Dundigal : కబ్జా కోరల్లో రామోజీ కుంట..
దిశ, దుండిగల్ : కుంటలు, చెరువుల పరిరక్షణకు ఓవైపు హైడ్రాను నియమించి పటిష్ట చర్యలు తీసుకుంటుంటే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులమో ఇవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దుండిగల్ గండిమైసమ్మ మండలం బౌరంపేట గ్రామంలో రామోజీ కుంటను అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జాకు పాల్పడుతున్నారు. రెవెన్యూ అధికారులేమీ పట్టించుకోకుండా వారికి సహకరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో ఓ స్కూల్ యాజమాన్యం రామోజీ కుంటలో మట్టిని నింపి పార్కింగ్‌తో పాటు స్కూల్ అవసరాల కోసం నిర్మాణాలు చేపట్టింది. మరో నిర్మాణ సంస్థ కోసం ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ కో ఆర్డినెట్స్‌ను అధికారులు తారుమారు చేసి అధికారికంగా అప్పగించారు. ప్రస్తుతం మరికొందరు శిఖం లో మట్టిని నింపి కబ్జాకు పాల్పడుతున్నారు. కొద్ది రోజులుగా కుంటలోకి వచ్చే సర్‌ప్లస్ నాలా ప్రవాహాన్ని అడ్డుకుంట్టూ మట్టి నింపుతూ కబ్జాకు పాల్పడుతున్నారు.మరో వైపు కల్వర్టు నాలాను డైవర్ట్ చేసి నర్సరీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఈ తతంగమంతా ఓ ద్వారా జరుగుతున్నట్లు అక్కడ నర్సరీ నిర్వహించే వ్యక్తి చెప్పడం విశేషం. కుంటను మాయం చేసేందుకు పనులు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి నీటి సంక్షోభం ఏర్పడక ముందే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
హెచ్ఎండీఏ లేక్స్ వెబ్‌సైట్‌లో కొత్త మ్యాప్ అప్లోడ్..
2013నాటి ఎఫ్‌టీఎల్ కో ఆర్డినెట్స్ ప్రకారం బౌరంపేట నుంచి సింహపురి కాలనీ కి వెళ్లే దారి కూడా రామోజీ కుంటల్లో భాగమేనని అధికారులకు తెలుసు. గతంలో భారీ షెడ్డును సైతం కూల్చివేశారు. తర్వాత అధికారులకు ముడుపులు ముట్టిన వెంటనే అక్రమ నిర్మాణాన్ని సక్రమం చేసి మళ్లీ నిర్మించారు. తాజాగా రామోజీ కుంటలో కబ్జాదారులు మట్టి నింపుతున్న సంబంధిత అధికారులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. కుంట కబ్జాలను అడ్డుకోకుండా 2013 నాటి పాత కూ ఆర్డినెట్స్ ను తారుమారు చేసి కుంటను కుంచించుకు పోవడానికి అధికారులు ప్రత్యేక పాత్ర పోషించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.