మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలి.. జిల్లా కలెక్టర్ గౌతమ్

by Geesa Chandu |
మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలి.. జిల్లా కలెక్టర్ గౌతమ్
X

దిశ, మేడ్చల్ బ్యూరో: మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు అన్నారు.ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమంలో భాగంగా గురువారం కలెక్టరేట్ లో జిల్లా గ్రామీణాభివృద్దిశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు వ్యాపారంలో వృద్ది సాధించాలని, అందుకు అధికారులు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. ఇందిరమ్మ మహిళ శక్తి ద్వారా ఎంపికైన బ్యూటిషియన్, మైక్ అండ్ లైటింగ్, డెకరేషన్, ఫుడ్ క్యాంటీన్, ఫోటోగ్రఫి, ఈవెంట్ మేనేజ్మ్మెంట్, కన్స్ట్రక్షన్ యూనిట్ల గ్రౌండింగ్ ను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.మహిళలు సమిష్టిగా వ్యాపారం నిర్వహించి, ఆర్థిక పరిపుష్టి సాధించాలన్నారు. ఫుడ్ క్యాంటీన్లకు స్థలం సమస్య ఉన్నట్లయితే మొబైల్ ఫుడ్ కోర్టులను తీసుకోవాలన్నారు.ఈ పనులన్నింటిని నవంబరు చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టరు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి సాంబశివరావు, మెప్మా పిడి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story