- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్ల కబ్జా పై మున్సిపల్ కార్యాలయం ఎదుట ఫుబ్బాల్ కమిటీ సభ్యుల ధర్నా..
దిశ, మల్కాజిగిరి : నేరేడ్ మెట్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫుట్బాల్ గ్రౌండ్ రోడ్ల కబ్జాను నిరసిస్తూ శుక్రవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఫుబ్బాల్ కమిటీ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ విషయమై ఐదు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ధర్నా అనంతరం డిప్యూటీ కమిషనర్ ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంఘాలు ఫుట్బాల్ గ్రౌండ్ కమిటీ చైర్మన్, సభ్యులు గత ఐదు రోజులుగా ఆందోళనలు నిర్వహించారు. మున్సిపల్ అధికారులు రోడ్లు కబ్జా కాకుండా చూసుకుంటామనీ, కేసుల విషయమై విచారణ జరిపి కోర్టులో కౌంటర్ దాఖలు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తారాసత్యం, నగర అధ్యక్షులు రవికాంత్, తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ కోశాధికారి సిలికాస్ట్, కృష్ణమూర్తి, రాజేశ్వర్, బాల ప్రసాద్, రాఘవన్, అంథోని , మనోజ్ మురళి, బీసీ సంఘం జీహెచ్ఎంసీ హైదరాబాద్ సిటీ జనరల్ సెక్రెటరీ సుమన్ గౌడ్, డీఎల్ సాయి నిరంజన్, సురేష్, సాయి, చిన్నసాయి జోసెఫ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.