రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట: మంత్రి మల్లారెడ్డి

by Kalyani |
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట: మంత్రి మల్లారెడ్డి
X

దిశ, దుండిగల్: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మాల్లారెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి చౌరస్తా నుంచి బహదూర్ పల్లి చౌరస్తా వరకు రూ. 25 కోట్ల వ్యయంతో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న 100 ఫీట్ల రోడ్డు వెడల్పు అభివృద్ధి పనులకు, దూలపల్లి అపర్ణ ఫార్మ్ గ్రూప్స్ సెప్టిక్ ట్యాంక్ నుంచి దూలపల్లి కల్వర్టు అశోక అలా మైనస్ వరకు 2.88 కోట్లతో చేపట్టనున్న ఆర్ సీసీ రోడ్డు పనులకు సోమవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు, స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా అవసరాలకు అనుగుణంగా భవిష్యత్ లో జనాభాను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే దిశగా రోడ్ల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. హెచ్ఎండీఏ ప్రతిపాదించిన రూ. 25 కోట్ల నిధులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంజూరు చేసి సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story