- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రికెట్ ఆన్ లైన్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు.. ముగ్గురు అరెస్ట్
దిశ, కుత్భుల్లాపూర్: బాలానగర్ ఎస్ఓటీ టీం, బాచుపల్లి పోలీసులు బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ ఆన్ లైన్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు. బాలానగర్ జోన్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారంతో బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ లో గల పీకాక్ జంక్షన్ కేఎస్ఆర్ క్లాసిక్ అపార్ట్ మెంట్ ఫ్లాట్ 401లో ఐపీఎల్ 2023 క్రికెట్ ఆన్ లైన్ బెట్టింగ్ ను నిర్వహిస్తున్న ముఠాపై బాచుపల్లి పోలీసులు, బాలానగర్ ఎస్ఓటీ టీంలు సంయుక్తంగా దాడి చేశారు.
నిందితులు నావుడు గణేష్ కుమార్(35), బోరపరెడ్డి శ్రీనివాస్ రావు(33), సోర్ల రాంబాబు (33)లను అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితులను నుంచి రూ.22,30,380 ల నగదు, బ్యాంక్ లో నిల్వచేసిన రూ.2,20,000లతో కలిపి మొత్తం రూ. 24,50,380 లు, అలాగే ల్యాప్ ట్యాప్, ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రజలు బెట్టింగ్ లకు దూరంగా ఉండాలని, ఎవరైనా ఇటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడితే 9490617444 కు సమాచారం ఇవ్వాలని డీసీపీ తెలిపారు.