త్వరలో ఫుట్​ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం

by Sridhar Babu |
త్వరలో ఫుట్​ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం
X

దిశ, ఘట్కేసర్ : ఘట్కేసర్ పోచారం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్, హైదరాబాద్ జాతీయ రహదారిపై త్వరలో ఫుట్​ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడతారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం పోచారం మున్సిపాలిటీ పరిధిలో అన్నోజిగూడలో పోచారం మున్సిపాలిటీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి తో కలిసి ఫుట్ ఓవర్ బ్రిడ్జి, అండర్ పాస్ ల నిర్మాణం చేపట్టే స్థలంను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఫుట్​ ఓవర్ బ్రిడ్జి, అండర్పాస్ ల నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ పనులు పూర్తి అయ్యాయని, అతి త్వరలో పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమం లో కౌన్సిలర్లు గొంగళ్ల మహేష్, సింగిరెడ్డి సాయిరెడ్డి, నాయకులు ఘట్కేసర్ మండల మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, పవన్ రెడ్డి, ఆకిటి బాల్ రెడ్డి, మహేష్, జితేందర్ నాయక్, సురేష్ నాయక్, నల్లవెల్లి రమేష్ ముదిరాజ్, జవాజీ అశోక్, రేతి వెంకటేష్, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed