- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలతో ప్రజలను మోసం చేసింది: ఈటల
దిశ,మేడ్చల్ టౌన్: గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలతో ప్రజలను నమ్మించి ఓట్లు సంపాదించిందినీ మల్కాజ్గిరి పార్లమెంట్ బిజెపి పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆరోపించారు. బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఇప్పటి వరకు ఏ మహిళకూ మహాలక్ష్మి పథకం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయల సాయం అందలేదన్నారు. మంగళవారం మేడ్చల్ మండలంలోని గౌడవెల్లి, కొనాయిపల్లి గ్రామ వాసులతో ఆత్మీయ సమ్మేళనంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ఇప్పటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు గడిచి పోయింది అని అన్నారు .
ఏ రైతుకూ రుణమాఫీ జరగలేదనీ,ఆటో వాళ్లకు పన్నెండు వేల రూపాయల సాయం అందలేదనీ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బ్యాంకుల్లో రుణాలు లేని రైతులు వెంటనే రుణాలు తీసుకోమని, తమ ప్రభుత్వం రాగానే రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీలు గుప్పించి ప్రజలను మోసం చేశారన్నారు. కనీసం ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పే మాటలకు, చేతలకు ఉన్న తేడా అర్థమయ్యే ఉంటుందన్నారు.కానీ బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదు అని చెప్పారు.
12 కోట్ల టాయిలెట్లు నిర్మించి, మహిళల ఆత్మగౌరవాన్ని ప్రధాని మోదీ కాపాడారన్నారు.కరోనా మహమ్మారి కాలంలో ప్రతి ఒక్కరికి తిండికి లోటు లేకుండా మనిషికి ఐదు కేజీల చొప్పున బియ్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చారని గుర్తు చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజానీకానికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయలేకపోయాయి. అలాంటిది మన దేశం ఇతర దేశాలకు కూడా కరోనా వ్యాక్సిన్ అందించిందని చెప్పారు. గతంలో బ్యాంకులంటే తెలియని పేద ప్రజానీకానికి కూడా జన్ ధన్ ఖాతాల ద్వారా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయించి నేడు ప్రతి చిన్న వ్యాపారులు కూడా డిజిటల్ పద్దతిలో ఫోన్‌పే ద్వారా సులువుగా డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారని అన్నారు.
దశాబ్దాలుగా కోర్టులో ఉన్న అయోధ్య సమస్యను చాలా సులువుగా పరిష్కరించడమే కాకుండా, ప్రపంచం నివ్వెరపోయే రీతిలో అద్భుతంగా అయోధ్యలో రామమందిర నిర్మాణం చేసి, చూపించిన ఘనత ప్రధాని మోదీదే అన్నారు. ప్రజల మత విశ్వాసాలను, నమ్మకాలను కాపాడుతున్నారు. ఇంతటి గొప్ప నేత అయిన నరేంద్ర మోదీని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని కమలం పువ్వు గుర్తుకే ఓటేసి గెలిపించాలని ఈటెల కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జగన్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, బీజేపీ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ అమరం మోహన్ రెడ్డి, నాయకులు నందా రెడ్డి, మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, కౌన్సిలర్, హంసా రాణి కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు