హస్తం నేతల డిష్యుం డిష్యుం.. ఎంపీ అభ్యర్థి ముందు గొడవ పడిన కాంగ్రెస్​ నాయకులు

by Disha Web Desk 23 |
హస్తం నేతల డిష్యుం డిష్యుం.. ఎంపీ అభ్యర్థి ముందు గొడవ పడిన కాంగ్రెస్​ నాయకులు
X

దిశ,కూకట్​పల్లి : పార్లమెంట్​ ఎన్నికల వేళ ఆయా నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం, పార్టీ బలోపేతం కోసం ఫైవ్​ మెన్​ కమిటీలను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్​ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం కూకట్​పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్​ నాయకుల మధ్య పెద్ద గొడవకు దారి తీసింది. పార్టీ ఆదేశాల మేరకు కూకట్​పల్లి నియోజకవర్గం ఇన్​చార్జి బండి రమేష్​ నేతృత్వంలో ఫైవ్​మెన్​ కమిటీ ఏర్పాటు చర్యలు ప్రారంభించారు. అందరికీ ప్రతినిధ్యం ఇవ్వలేమని నిర్ణయించి ఫైవ్​ మెన్​ కమిటీ కాస్త నైన్​ మెన్​ కమిటీ గా మారింది. ఈ కమిటీలో సీనియర్​ నాయకులు, ఆయా డివిజన్​ల నుంచి గ్రేటర్​ ఎన్నికల్లో కార్పొరేటర్​లుగా పోటీ చేసి ఓటమి పాలైన వారికి, మైనారిటీలు, సీమాంధ్ర ప్రాంత నాయకులకు సరియైన ప్రాధాన్యత కల్పించకపోవడంతో కూకట్​పల్లి కాంగ్రెస్​ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఎంపీ అభ్యర్థికి మద్దతుగా అల్లాపూర్​ డివిజన్​లోని ఎస్​డి ఫంక్షన్​ హాల్​లో సమావేశం నిర్వహించారు.

కాగా సమావేశం కు సంబంధించిన సమాచారం తమకు ఇవ్వలేదని, కార్పొరేటర్​ గా పోటీ చేసి ఓటమికి పాలైన సీనియర్​ నాయకుడు మోయిజ్​ సభ వేదికపై ఇన్​చార్జి బండి రమేష్​ను నిలదీశాడు. ఈ క్రమంలో సమావేశాలకు సంబంధించిన సమాచారం ఇవ్వడం లేదు. కమిటీలలో సీనియర్​లకు, కాంటెస్టేడ్​ కార్పొరేటర్​లకు సరియైన ప్రాధాన్యత ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని నిలదీసినట్టు సమాచారం. మోయిజ్​కు తోడుగా మూసాపేట్​కు చెందిన మరో ఇద్దరు సీనియర్​ నాయకులు కమిటీలలో తమకు చోటు కల్పించకపోవడం ఏంటని నిలదీశారు. వేదికపై గంట పాటు పెద్ద ఉద్రక్తత వాతావరణం నెలకొన్నట్టు పార్టీ శ్రేణులు తెలిపారు. నియోజకవర్గం ఇన్​చార్జి వైఖరిని అక్కడ ఉన్న సీనియర్​లు తప్పు పట్టారు. కమిటీలో తనకు నచ్చిన వారిని నియమించుకున్నారని, అదే విధంగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఏ ఒక్కరిని కమిటీలో తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. కూకట్​పల్లి కాంగ్రెస్​ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయనే చెప్పవచ్చు. ఉదయం కేపీహెచ్​బీ కాలనీ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో సునీత మహేందర్​ రెడ్డి పాల్గొనగా నియోజకవర్గం ఇన్​చార్జి ప్రచారంలో గైర్హాజరు అయ్యారు.

Next Story

Most Viewed