- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆగస్టు లోపు పెండింగ్ పనులు పూర్తి చేయండి: ఎమ్మెల్యే మాధవరం
దిశ, కూకట్పల్లి: ఆగస్టు నెల లోపు నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ, జలమండలి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న డ్రైనేజి పైప్లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అకాల వర్షాలకు, ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు కూలి పోతుండటంతో విద్యుత్ సమస్య ఉత్పన్నమవుతుందని, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పని చేస్తూ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళిక బద్దంగా పని చేయాలని, అకాల వర్షాలకు వరద సమస్య, విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను ఆగస్టు లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సబీహ బేగం, ఆవుల రవీందర్ రెడ్డి, మందాడి శ్రీనివాస్ రావు, మాజీ కార్పొరేటర్ తూం శ్రావణ్ కుమార్, జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు గౌసుద్దిన్, జోనల్ ఎస్ఈ చెన్నారెడ్డి, ఈఈలు సత్యనారాయణ, గోవర్ధన్ గౌడ్, డీఈలు ఆనంద్, శ్రీదేవి, ఏఈలు అరవింద్, శివప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.