- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అంధకారంలో కాలనీలు...పట్టింపులేని అధికారులు
దిశ, ఘట్కేసర్ః ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనిధి, మారుతి నగర్ కాలనీలో గత నెల రోజులుగా విద్యుత్ దీపాలు వెలగక పోవడంతో అంధకారం నెలకొందని కాలనీవాసులు వాపోతున్నారు. అధికారులకు, సిబ్బందికి ఇంటి పన్నుల వసూళ్ల పై ఉన్న శ్రద్ధ కాలనీల అభివృద్ధిపై పట్టింపు లేకుండా పోయిందని విమర్శిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధి 4వ వార్డు లోని మారుతి నగర్, శ్రీనిధి కాలనీల నుంచి దాదాపు రూ. 40 లక్షలకు పైగా ఇంటి పన్నుల రూపేణా మున్సిపల్ కి ఆదాయం చేకూరుతున్నా మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్ పర్సన్ పట్టించుకోవడంలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ జనరల్ బాడీ సమావేశంలో 4వ వార్డు లో వీధి దీపాల సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదని కౌన్సిలర్ బండారి అంజనేయులు గౌడ్ తెలిపారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కాలనీవాసులు హెచ్చరించారు.