పీర్జాదిగూడ కాంగ్రెస్‌లో కోల్డ్ వార్.. మేయర్ వర్సెస్ అధ్యక్షుడు

by Aamani |
పీర్జాదిగూడ  కాంగ్రెస్‌లో  కోల్డ్ వార్.. మేయర్ వర్సెస్ అధ్యక్షుడు
X

దిశ,మేడిపల్లి: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీలో కోల్డ్ వార్ నడుస్తోంది. మేయర్ వర్సెస్ అధ్యక్షుడు మధ్యలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఎక్కువ అయ్యాయి. ఒక్కో కార్పొరేషన్ ను కాంగ్రెస్ కైవసం చేసుకుంటూ వస్తుంది. అప్పటివరకు ఉన్న పగోళ్ళందరు తమవారైయ్యారు. అదే తరహాలో పీర్జాదిగూడ మేయర్ పీఠం కైవసం కోసం ఎన్నో ఎత్తులు పై ఎత్తులు సినిమా మాదిరి జరిగింది. కారణం ఇక్కడ బీఆర్ఎస్ మేయర్ గట్టిగా ఉండటమే.. చివరకు పీర్జాదిగూడ మేయర్ పీఠం కూడా మారింది.

కాంగ్రెస్ వశమయ్యింది. మేయర్ పీఠం కైవసం కోసం కార్పోరేటర్లను మలుచుకోవడంలోను అధ్యక్షుడు రవి తన వంతు కృషి చేశారు. అందరూ కలిసి పని చేశారు. కాంగ్రెస్ నుండి మేయర్ అమర్ సింగ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచి కోల్డ్ వార్ మొదలయ్యింది.కార్పొరేషన్ లో ఏ కార్యక్రమం ఉన్న అధ్యక్షునికి ఇన్విటేషన్ లేకపోవడం, ఉన్నా అందరితో కలవకపోవడం పై సర్వత్ర చర్చలు మొదలయ్యాయి. కార్పోరేటర్లు మేయర్ ఓ వర్గం.. అధ్యక్షుడు పాత వారు ఒక వర్గంగా ఏర్పాటయ్యారు. కార్పొరేషన్ లో జరుగుతున్న కార్యక్రమాలకు విరివిరిగా వెళ్ళడంతో ప్రజల్లో అనుమానం నిజమైంది.

కాంగ్రెస్ లో ఎవరు ఎక్కువ రోజులు కలిసి పనిచేయలేరు అనే భావన ప్రజలు వచ్చేసింది. కార్పొరేషన్ లో సీనియర్ నాయకులు వీరిరువురికి ఒకే గాడి మీదకు తీసుకురాలేక పోతున్నారు. కార్పొరేషన్ లో జరుగుతున్న కార్యక్రమాలకు అందరూ కలిసి పాల్గొనలేని పరిస్థితి నెలకొంది. వీరిరువురి కోల్డ్ వార్ పెద్దనాయకులకు తెలిసినా తెలియనట్లు కాలం వెల్లదీస్తున్నారు.కార్పొరేషన్ లో వీరిరువురి మధ్య వార్ ఎప్పటికి తగ్గుతుందో కార్పొరేషన్ సమస్యలు ఇరువురు కలిసి నాయకులతో మాట్లాడి ఎప్పుడు పరిష్కరిస్తారో వేచి చూడాలి.

Next Story