- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంటల తరబడి నిరీక్షణ.. ఐదు సెకన్లలోనే ఖతం
దిశ, పేట్ బషీరాబాద్: సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలకు నిరాసే మిగిలింది. ముఖ్యమంత్రి మెదక్ పర్యటన నేపథ్యంలో కుత్బుల్లాపూర్ మీదుగా మెదక్ వెళ్లేందుకు వస్తున్నారని సమాచారంతో ఉదయం 10 గంటల సమయం నుండి కుత్బుల్లాపూర్ ఐడిపిఎల్ సిగ్నల్ వద్ద ఎమ్మెల్యే వివేకానంద్, టీఆర్ఎస్ శ్రేణులు భారీగా వేచి ఉన్నారు. అయితే మధ్యాహ్నం ఒంటిగంట 28 నిమిషాలకు సీఎం కాన్వాయ్ ఐడిపిఎల్ చేరుకున్నప్పటికీ ముఖ్యమంత్రి బస్సులో నుంచే అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు. ఎమ్మెల్యే వివేకానంద ముఖ్యమంత్రి కి చేతులు ఎత్తి నమస్కరిస్తూ స్వాగతం పలికారు. కాగా గంటలు తరబడి నిరీక్షించి నప్పటికీ 5 సెకన్లలో కేసీఆర్ కాన్వాయ్ తమ ముందు నుంచి వెళ్లిపోవడంతో నిరాశతో కార్యకర్తలు వెనుదిరిగారు.
నిరుత్సాహంతో వెనుతిరిగిన సూపర్ మ్యాక్స్ కార్మికులు
జీడిమెట్ల పారిశ్రామిక వాడ లో ఉన్న సూపర్ మ్యాక్స్ కంపెనీ కార్మికులు గత కొన్ని నెలలుగా తమకు జీతాలు రావడం లేదని అదేవిధంగా ఇతరత్ర సమస్యలను వివరిస్తూ రూపొందించిన మెమోరండాన్ని అందించేందుకు వేచి ఉన్నారు. వీరు కూడా సీఎం కాన్వాయ్ ఆగకుండా వెళ్లిపోవడంతో నిరుత్సాహంతో వెళ్లి పోయారు.