యూ ట్యూబ్ వీడియోలతో చైన్ స్నాచింగ్..

by Vinod kumar |   ( Updated:2023-09-08 13:33:36.0  )
యూ ట్యూబ్ వీడియోలతో చైన్ స్నాచింగ్..
X

దిశ, రాచకొండ: డయల్ 100 కు ఫోన్ చేసి గ్రామస్థులు ఓ చైన్ స్నాచర్‌ను గంటల వ్యవధిలో పట్టించిన ఘటన రాచకొండ పోలీసు కమిషనరేట్ పోచంపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. పొచంపల్లి మండలం జిబిలకపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ(65) గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం లో ఆవు పేడ కోసం బయటికి రాగా.. ఓ గుర్తు తెలియని వ్యక్తి చిన్న కొండూరు గ్రామానికి దారేటు ఎటు అని అడిగి ఆమే మెడ లోని బంగారం గొలుసు ను తెంపుకుని పారిపోయాడు. దీంతో వెంటనే అప్రమతమైన స్థానికులు డయల్ 100 కు ఫోన్ చేశారు.

రంగంలోకి దిగిన పోచంపల్లి ఇన్స్పెక్టర్ మహేష్ బృందం సీసీ కెమెరాలను పరిశీలించి గొలుసు దొంగతనానికి పాల్పడింది గుండ్లబావి ప్రాంతానికి చెందిన చీడుగుల రవిగా గుర్తించి అతనిని 6 గంటల్లో పట్టుకుని బంగారం గోలుసును రికవరీ చేశారు. స్నాచర్ చీడుగుల నరేష్ ఆన్లైన్ జూదం, క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడి 20 లక్షలు అప్పుల పాలయ్యడు. దీంతో ఈ ఆర్ధిక కష్టాల నుంచి బయటపడేందుకు యూ ట్యూబ్‌లో చైన్ స్నాచింగ్ వీడియోస్‌ను స్నాచింగ్ ఆ తర్వాత ఎస్కేప్ గురించి నేర్చుకున్నాడని పోలీసు దర్యాప్తులో స్పష్టమైంది.

Advertisement

Next Story