యువతకు చర్చా వేదిక.. కేఫ్ పాలిటిక్స్..

by Sumithra |
యువతకు చర్చా వేదిక.. కేఫ్ పాలిటిక్స్..
X

దిశ,కంటోన్మెంట్/బోయిన్ పల్లి : పార్టీల పరంగా ప్రజల అభిప్రాయాలు భిన్నమైనది అయినప్పటికీ, ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరంలో చాయ్ పట్ల వారికి ఉన్న ప్రేమ వారిని ఒకచోట చేర్చింది. దానిని సద్వినియోగం చేసుకుంటూ కేఫ్ పాలిటిక్స్ పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని శుక్రవారం తెలంగాణ మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ క్రిశాంక్ ప్రారంభించారు. కంటోన్మెంట్ యువకులు పార్టీ రాజకీయాల నుండి ఈ ప్రాంతాన్ని పీడిస్తున్న పౌర సమస్యలు, వివిధ సమస్యల పై యువకులు ఈ కార్యక్రమంలో అన్ని రకాల సమస్యల గురించి క్రిశాంక్ తో కలిసి చర్చించారు.

యువతతో క్రిశాంక్ మాట్లాడుతూ యువకులు మాట్లాడటం, చర్చించుకోవడం చాలా ముఖ్యం అని, కేఫ్ పాలిటిక్స్అనేది నా హృదయానికి దగ్గరగా ఉన్న కార్యక్రమం అని, ఇది యువకులు వారి ఆలోచనలను వ్యక్తపరచడానికి వేదికగా మారుతున్నట్లు నేను భావిస్తున్నానని క్రిశాంక్ అన్నారు. ప్రతి గురువారం సాయంత్రం జరిగే కేఫ్ పాలిటిక్స్ కార్యక్రమానికి కంటోన్మెంట్‌లోని అన్ని కేఫ్‌లు వేదికలుగా మారుతున్నాయి. ఈ కార్యక్రమంలో బిస్కెట్లు, చాయ్ తాగుతూ చర్చలు నిర్వహిస్తున్నమన్నారు. ఇందులో భాగంగా బోయిన్ పల్లి చాయ్ అడ్డా, రసూల్ పుర బషీర్ కేఫ్ లలో యువతతో గంట పాటు వారి ఆలోచనలను, తన ఆలోచనలు షేర్ చేసుకున్నామని క్రిశాంక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రఘు, మోని, అనురాగ్, వాసు, రషీద్, ఇమ్రాన్, గోపి, రాజు, కళ్యాణ్, రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story