- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగం రాలేదని బీటెక్ విద్యార్థి...
దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: ఉద్యోగం రావడం లేదని ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనంద్ గర్ కాలనీలో నివాసం ఉంటున్న అబ్దుల్ బారిక్ ఎలక్ట్రిషన్ కాగా భార్య ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. కూతురుకు వివాహం కాగా, చిన్న కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. పెద్ద కుమారుడు అబ్దుల్ ఖాదీర్ (24) 2019 లో సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు.
అనంతరం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ, అతనికి కాస్త చూపు సరిగా కనిపించకపోవడంతో ఎక్కడ ఉద్యోగం లభించలేదు. దీనికి తోడు గతకొన్ని రోజులుగా ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిం విసిగిపోయాడు. దీంతో మనస్టాపం చెందిన అబ్దుల్ ఖాదీర్ శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న యాసిడ్ తాగి తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో హుటాహుటిన ఖాదీర్ ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించింది. దీంతో వారు గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. ఆక్కడ చికిత్స పొందుతున్న క్రమంలో అబ్దుల్ ఖాదీర్ ఆదివారం మధ్యాహం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బంధువుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న బోయిన్ పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.