బీఆర్ఎస్ తోనే గౌడ సంక్షేమ సంఘం అభివృద్ధి : బండారి లక్ష్మారెడ్డి

by Sumithra |
బీఆర్ఎస్ తోనే గౌడ సంక్షేమ సంఘం అభివృద్ధి : బండారి లక్ష్మారెడ్డి
X

దిశ, ఉప్పల్ : బీఆర్ఎస్ తోనే గౌడ సంక్షేమ సంఘం అభివృద్ధి జరుగుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం పెద్దఉప్పల్ గౌడ సంక్షేమ సంఘంతో ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి సమావేశమయ్యారు. అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి గౌడ సంఘం మహిళలు మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డాక గౌడకులస్తుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి చేశారన్నారు. ఈత, తాటి చెట్ల పెంపకంతోపాటు పింఛన్‌, బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.

రానున్న రోజుల్లో మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, ఒక అవకాశం ఇవ్వండి ఉప్పల్ ప్రజలకు సేవ చేస్తానని ఈ నెల 30వ తారీకు జరిగే ఎన్నికల్లో ఈవీఎం మిషన్ లో మూడో నెంబర్ లో ఉన్న కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు. నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని గౌడ కులస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అరటికాయల భాస్కర్, గౌడ సంఘం అధ్యక్షులు బజారు హరినాథ్ గౌడ్, బూత్కుల పెంటయ్య గౌడ్, మీనంపల్లి అశోక్ గౌడ్, పండ్ల శ్రీనివాస్ గౌడ్, మీనంపల్లి నరసింహ గౌడ్, కందికట్ల అశోక్ గౌడ్, పంజాల జైహింద్ గౌడ్, ఈశ్వర్ గౌడ్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed