బీఆర్ఎస్‌కు దిక్కు దివానా లేదు.. రేవంత్ రెడ్డి అబద్దాలతో అధికారంలోకి వచ్చారు : ఈటల

by Aamani |
బీఆర్ఎస్‌కు దిక్కు దివానా  లేదు.. రేవంత్ రెడ్డి అబద్దాలతో అధికారంలోకి వచ్చారు : ఈటల
X

దిశ, మేడ్చల్ బ్యూరో : అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి దిక్కు దివానా లేదని మల్కాజ్ గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ ఒకసారి కూలిపోతే ఈ పార్టీలో ఎవరు మిగిలే లా లేరని, ఖాళీ అయిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్,బీజేపీ నాయకులు మల్లారెడ్డి, భరత్ రెడ్డిలతో కలిసి ఈటల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం ఇతర పార్టీ కండువా కప్పుకుంటే రాసి రంపాన పెట్టారని దుయ్యబట్టారు. డబుల్ బెడ్ ఇండ్లు, పెన్షన్ లు రావంటూ ఇబ్బంది పెట్టారని ,కేసీఆర్ మాటలు ఉత్త బోగస్ అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం 2.53 లక్షల ఇళ్లు ఇస్తే కట్టడం కూడా చేతకాలేదని ద్వజమెత్తారు. సొంత ఇంటి కల తీర్చే బాధ్యత బీజేపీ దేనని స్పష్టంచేశారు. 12 కోట్ల టాయిలెట్స్ కట్టించి మహిళల ఆత్మగౌరవం కాపాడిన ఘతన ప్రధాని నరేంద్ర మోడీ కే దక్కుతుందన్నారు.

అబద్దాలు చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. వంద రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఇంకో వంద రోజులు పోతే నేను ఎగబడతానని ఈటల హెచ్చరించారు. ప్రధాని మోదీ హయాంలో చైనా బజార్ లు మూత పడి, అన్ని వస్తువులు మన దగ్గరే తయారవుతున్నాయని వెల్లడించారు.ఇప్పుడు అంత మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని పేర్కొన్నారు.కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది. ఒక్కటి అమలు చేయడం లేదన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తానని స్పష్టంచేశారు.రాష్ట్రంలో ఇచ్చిన హామీల కోసం కొట్లాడతానన్నారు.

Advertisement

Next Story

Most Viewed