- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మాయిలను గౌరవించే సంస్కారం అబ్బాయిలకు నేర్పాలిః సీపీ సుధీర్ బాబు
దిశ, ఉప్పల్ : అమ్మాయిలను గౌరవించే సంస్కారం అబ్బాయిలకు నేర్పించాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. అమ్మాయిలకు భయం వద్దని.. మేము మీకు భరోసాగా ఉంటామని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగకుండా చూడడానికి, తల్లిదండ్రులు తమ అమ్మాయిలకి అలా ఉండాలి, ఇలా ఉండాలని జాగ్రత్తలు చెప్తుంటారు కానీ నిజానికి ఇది ఒక్కటే సరిపోదన్నారు. చిన్నప్పటి నుండే అబ్బాయిలకు, తమ సొంత వారే కాక బయటి అమ్మాయిలు కూడా మన అమ్మ, చెల్లి లాంటివారే అని వారిని కూడా గౌరవించాలనే సంస్కారం కూడా నేర్పాలన్నారు. అప్పుడే అమ్మాయిల పట్ల అబ్బాయిల అభిప్రాయం, ఆలోచనా తీరు మారుతుందన్నారు. మహిళల రక్షణ పట్ల తెలంగాణ ప్రభుత్వం, రాచకొండ పోలీస్ పూర్తి నిబద్ధతతో ఉన్నామన్నారు. మహిళలకు అండగా Dail-100, షీ టీమ్స్, సోషల్ మీడియా ఫిర్యాదుల విభాగాలు, భరోసా సెంటర్లతో పాటు కఠినమైన చట్టాలు ఉన్నాయని పేర్కొన్నారు.