పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. యువతి ఆత్మహత్య

by Hamsa |
పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. యువతి ఆత్మహత్య
X

దిశ, జవహర్ నగర్: గత కొంత కాలంగా ప్రేమించిన ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.

ఎస్సై నాగరాజు గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. పూజ (18), దయాకర్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ పేరుతో నమ్మబలికి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్ లోని భూపేష్ నగర్ లో దయాకర్ ఉండే అద్దె ఇంట్లోకి పూజను తీసుకొచ్చాడు. పూజ పెళ్లి విషయం అడగగా నిరాకరించడం, ఇతర విషయాల్లో తరచుగా ఇబ్బంది పెట్టడంతో పూజ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో అదే ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని పూజ ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి చింతలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ.. పూజ మృతికి కారణమైన దయాకర్ ను అరెస్ట్ చేసి ఈ నెల 25న రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై నాగరాజు గౌడ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed