- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
బాచుపల్లిలో బాలుడు అదృశ్యం..
దిశ, కుత్బుల్లాపూర్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ బాలుడు అదృశ్యం అయిన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం అప్పన్న, క్రిష్ణవేణి దంపతులు గత కొంతకాలం నుంచి నిజాంపేట్ రాజీవ్ గృహ కల్పలో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు కిరణ్ సాయి (13) స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు.
ఆదివారం ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన కిరణ్ సాయి తిరిగి ఇంటికి చేరుకోలేదు. చుట్టు పక్కల వారిని, బంధువులను బాలుడి ఆచూకీ కోసం అడిగినా, తల్లిదండ్రులు వెతికినా బాలుడి జాడ తెలియలేదు. దీంతో బాచుపల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. బాలుడి సమాచారం ఎవ్వరికైనా తెలిస్తే బాచుపల్లి పోలీస్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ 9491060942, సెక్టర్ ఎస్సై శ్రీనివాస్ 8712568270 కు తెలపాలని ప్రజలను కోరారు.