బోడుప్పల్ వక్ఫ్ బోర్డు బాధితులు కీలక ప్రకటన..

by Vinod kumar |
బోడుప్పల్ వక్ఫ్ బోర్డు బాధితులు కీలక ప్రకటన..
X

దిశ, మేడిపల్లి: ప్రభుత్వం తమ గోడు వినడం లేదని వక్ఫ్ బోర్డు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 18 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు రెడీ అవుతున్నామని పత్రికా ప్రకటన విడుదల చేశారు. గత 50 రోజులుగా బొడుప్పల్ ప్రజలకు వక్ఫ్ బోర్డు పేరుతో జరుగుతున్న అన్యాయం పై బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బాధిత కుటుంబాలు, అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

గత 17 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కూడా కొనసాగుతున్నాయని.. ఇవన్నీ మీడియా సహాయంతో ప్రభుత్వం దృష్టికి వెళ్లినప్పటికీ.. ప్రభుత్వ అధికారుల నుంచి కానీ, స్థానిక మంత్రి ద్వారా కానీ ఎలాంటి పరిష్కారం రాలేదు. దీంతో ఈనెల 18 శనివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి జేఏసీ సిద్దమైంది. జేఏసీ చేస్తున్న దీక్షలకు, నిరసనలకు ఇప్పటికే అనేక రాజకీయ పార్టీల ద్వారా మద్దతు లభించిందని తెలిపారు.

Advertisement

Next Story