మల్కాజిగిరి ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయం : ఈటల

by Aamani |
మల్కాజిగిరి ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయం : ఈటల
X

దిశ,మల్కాజిగిరి : మల్కాజిగిరి ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిగిరి, నేరేడ్మెట్, వినాయక్ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. శనివారం మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ లో వాకర్లను కలిసి బీజేపీని బలపర్చాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో భాను ప్రకాష్, బీజేవైఎం మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్, నరహరితేజ జనరల్ సెక్రటరీ, వాసంశెట్టి శ్రీనివాస్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్,లక్ష్మణ్ డివిజన్ అధ్యక్షుడు పాల్గొన్నారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణులకు ఈటల రాజేందర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. దేశానికి దేశభక్తి కలిగిన, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉన్న పార్టీ ఉండాలని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి ప్రజాస్వామిక వాదులపై, దేశభక్తి కలిగిన నాయకుల పైన హింస ప్రయోగించి జైళ్లలో పెట్టారానీ, నియంతృత్వపు కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు జనతా పార్టీ ఏర్పాటు చేస్తే.. యావత్ ప్రజానీకం జనతాపార్టీని ఆశీర్వదించారన్నారు. ఆనాటి నుండి ఎన్నో ఎత్తు-పల్లాలను చూసి, ఎన్నో అవమానాలు భరించిన బీజేపీ, దేశ ప్రజల ఆశీర్వాదం పొంది 2014 లో మోడీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిందనీ, ఈ పదేళ్లలో సుపరిపాలన అందించడమే కాకుండా.. దేశ ప్రజల ఆత్మగౌరవం పెంచిన పార్టీ భారతీయ జనతా పార్టీగా అభివర్ణించారు. నేరెడ్మెట్ లో జరిగిన జెండా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, బీజేవైఎం మాజీ అధ్యక్షుడు భాను ప్రకాష్ తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed