- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దగ్గర బీజేపీ నిరసన..
దిశ, దుండిగల్ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలంటూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దేవేందర్ నగర్, బహదూర్ పల్లిలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల దగ్గర మాజీ ఎమ్యెల్యే కునా శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంతకు ముందు పోలీస్ లు ముందస్తు సమావహారంతో శ్రీశైలం గౌడ్ ను ఇంటి నుండి బయటికి రాకుండా నిర్బంధించినా చాకచక్యంగా వ్యవహరించి బయటకు వచ్చిన శ్రీశైలం గౌడ్ బహదూరపల్లి డబల్ బెడ్ రూమ్ ఇళ్ల దగ్గర బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి రావడంతో పోలీస్ లు కార్యకర్తలను అదుపు చేయలేకపోయారు.
చేసేది లేక డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి, బీజేపీ నేతలు రాకుండా అడ్డుకున్నారు. జీడిమెట్ల పోలీసులు బహదూర్ పల్లి వద్ద కూన శ్రీశైలం గౌడ్ ని అరెస్ట్ చేసి శామీర్ పేట్ పొలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెయ్యి ఇండ్ల పట్టాలు, 25 వేల ఇందిరమ్మ ఇండ్లు పేదలకు పంచామన్నారు. రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే వివేక్ పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, కట్టిన అరకొర ఇండ్లను పేదలకు పంచాలని నేను దీక్షకు పిలుపునిస్తే పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారన్నారు. పేదలకు ఇండ్లు ఇచ్చేంతవరకు నా పోరాటం ఆగదన్నారు. శ్రీశైలం గౌడ్ ను పోలీస్ లు అరెస్ట్ చేయడంతో బహదూపల్లిలో ఉద్రిక్తవాతావరణం నెలకొంది.
దేవేందర్ నగర్ లో..
దేవేందర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద బీజేపీ నాయకుడు కూన శ్రీనివాస్ గౌడ్ బీజేపీ నాయకులతో కలిసి పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనలు చేపట్టగా పోలీసులు అరెస్ట్ చేసి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతగాని బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పేరోజు దగ్గరలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, జాయింట్ కన్వీనర్ రాము గౌడ్, బీజేపీ నాయకులు జెకె శేఖర్ యాదవ్, బక్క శంకర్ రెడ్డి, గడ్డం రాజేందర్ రెడ్డి, ఆకుల సతీష్, గరిగే శేఖర్ ముదిరాజ్, బావిగడ్డ రవి, సదానందం, మోతే శ్రీనివాస్ యాదవ్, రామచంద్రనాయక్, కౌన్సిలర్లు రాజిరెడ్డి, జీవన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, పున్నారెడ్డి, రాజేశ్వరరావు, కంది శ్రీరాములు, పత్తి సతీష్, సాయినాథ్ నేత, దుర్యోధనరావు, భానుచందర్, మేకల సురేష్ రెడ్డి, అర్కల సుధా, అరుణ రెడ్డి, పూలమ్మ, అరువ వెంకట్, కృష్ణ యాదవ్, రాజిరెడ్డి, సుశాంత్ గౌడ్, సాయిరాం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.