మేడ్చల్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

by Sumithra |
మేడ్చల్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
X

దిశ, మేడ్చల్ టౌన్ :మేడ్చల్ నియోజకవర్గ మహా జన్ సంపార్క్ అభియాన్ సంయుక్త మొర్చల సమ్మేళనం ఆదివారం మేడ్చల్ మున్సిపాలిటీలో మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు పట్లోల్లా విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దుబ్బాక నియోజకవర్గ శాసనసభ్యులు మధవనేని రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గంలో మోర్చ చాలా పటిష్టంగా, గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నాయి అని అభినిందించారు.

ఈ సారి మేడ్చల్ నియోజకవర్గంలో ఎగిరేది బీజేపీ జెండనే అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు నరేంద్ర మోదీ 9 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, తిరుమల రెడ్డి, అమరం మోహన్ రెడ్డి, కిషన్ రావు, ప్రభాకర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, బిక్కు నాయక్, బుద్ది శ్రీనివాస్, సామల పవన్ రెడ్డి, కోండం ఆంజనేయులు ముదిరాజ్, అన్ని మోర్చల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story