Malla Reddy మెడికల్ కాలేజ్ సీట్ల భర్తీపై ఐటీ అరా

by Vinod kumar |   ( Updated:2022-11-22 10:20:51.0  )
Malla Reddy మెడికల్ కాలేజ్ సీట్ల భర్తీపై ఐటీ అరా
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ సీట్ల భర్తీ పై ఐటీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి మెడికల్ సీట్ల పై అనేక ఆరోపణలు ఉన్నాయి. కన్వీనర్ కోటాకి బదులు ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ సీట్లను రూ. కోట్లకు అమ్ముకున్నట్లు మల్లారెడ్డి కాలేజ్ పై విమర్శలు ఉన్నాయి. మొత్తం నాలుగు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్‌ల బ్యాంకు లావాదేవీలను ఐటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. మెడికల్ కాలేజ్ లావాదేవీల్లో భారీ వ్యత్యాసాలు బయట పడుతున్నట్లు సమాచారం.. ఎట్టకేలకు మంత్రి మల్లారెడ్డి సెల్ ఫోన్‌ను ఐటీ స్వాధీనం చేసుకున్న తెలుస్తుంది. తన నివాసం పక్క క్వార్టర్స్‌లో జూట్ బ్యాగ్‌లో సెల్ ఫోన్‌ను సిబ్బంది దాచి పెట్టినట్లు గుర్తించారు. జూట్ బ్యాగ్‌లో ఉన్న సెల్ ఫోన్‌ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

Advertisement

Next Story