‘గంజాయి పీలుస్తున్నారా.. ప్రతివారం స్టేషన్‌లోసంతకం పెట్టాల్సిందే..’

by Aamani |
‘గంజాయి పీలుస్తున్నారా.. ప్రతివారం స్టేషన్‌లోసంతకం పెట్టాల్సిందే..’
X

దిశ,రాచకొండ : గంజాయి, డ్రగ్స్ నియంత్రణ లో భాగంగా ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గంజాయి సేవించి పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు తో పాటు వారిపై నిఘా పెట్టేందుకు వారిని ప్రతి వారం లో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ పోలీసు స్టేషన్ కు వచ్చి సంతకాలు పెట్టాలని ఆదేశిస్తున్నారు. ఇలా గంజాయి తాగి పట్టుబడ్డ వారిని ఆ ప్రాణాంతక మత్తు మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఉప్పల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.

6 నెలల పాటు ప్రతి వారం అధికారులు నిర్ణయించిన రోజు రావాల్సి ఉంటుంది. ఈ సమయం లోనే వారిని పలు కోణాల్లో ప్రశ్నించి వారు నిజంగానే గంజాయి మత్తుకు దూరమవుతున్నారో లేదా అని గమనిస్తామని ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ స్పష్టం చేశారు. అదే విధంగా గంజాయి తాగిన వారిని మేజిస్ట్రేట్ ముందు బైండోవర్ చేస్తామన్నారు. బైండోవర్ నిబంధనలు ఉల్లగించిన వారిని బ్రీచ్ కింద నేరుగా 2 సంవత్సరాలు జైలు, 2 లక్షలు జరిమానా విధించే చట్టం, అధికారం బైండోవర్ చేసిన మేజిస్ట్రేట్ కు ఉందని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ స్పష్టం చేశారు. గంజాయి విక్రయించే వారికి కూడా ఇదే చట్టం తో పాటు ఇంకా కొన్ని సెక్షన్ లు వర్తిస్తాయని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.

ఈ బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించిన 5 గురికి 2 సంవత్సరాల జైలు, 2 లక్షల జరిమానా విధించిన సంఘటనలు ఉన్నాయని చంద్రశేఖర్ వివరించారు. గంజాయి తాగిన దాదాపు 300 మంది విద్యార్థులు,యువత కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చామని చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.మా ఎక్స్సైజ్ సైట్ లో గంజాయి తాగి, అమ్ముతూ దొరికిన వారి పూర్తి చిట్టా ఫోటో అప్లోడ్ చేసి ఉంటుందన్నారు. దీని గంజాయి కేసులో దొరికిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు దొరకవని, వీసాలు కూడా రావని ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ చెప్పారు. కాబట్టి యువత, విద్యార్థులు తస్మాత్ జాగ్రత్త అంటూ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story