మతి స్థిమితం లేని వ్యక్తి అదృశ్యం..

by Kalyani |
మతి స్థిమితం లేని వ్యక్తి అదృశ్యం..
X

దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: ఇంటి నుంచి బయటకు వెళ్లిన మతిస్థిమితం వ్యక్తి అదృశ్యమైన సంఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ బోయిన్ పల్లి గౌరీ నగర్ లో నివాసం ఉంటున్న అబ్దుల్ రషీద్ (68) కు గత కొంతకాలంగా మతి స్థిమితం సరిగా లేదు. దీంతో ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం నుంచి ఇంట్లోనే ఉంటున్న అబ్దుల్ రషీద్ రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారిని బంధువులను ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో గురువారం బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed