- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్యాస్ ధర పెంచడం సిగ్గుచేటు : ఐద్వా
దిశ, కాప్రా: మహిళా దినోత్సవ సందర్భంగా మోడీ గ్యాస్ ధర పెంచడం దేశానికే సిగ్గుచేటని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం విమర్శించింది. ఈ మేరకు గురువారం ఐద్వా మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈసీఎల్ కమలానగర్ చౌరస్తాలో కట్టెల పొయ్యితో నిరసన నిర్వహించింది. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా కార్యదర్శి వినోద మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం సామాన్యులపై, మహిళలపై మళ్లీ పెనుబారం మోపిందన్నారు. మోడీ ప్రభుత్వం పలు మార్లు గ్యాస్ ధర పెంచడం, నేడు ఏకంగా నిన్నటికి నిన్న 50 రూపాయలు పెంచడం సబబు కాదన్నారు. ఇప్పటికే ప్రజలు నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే సామన్యులు కొనలేని, తినలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు శారద, లీలావతి, శోభ, సుశీల, మాధవి లక్ష్మి, గౌస్య, జ్యోత్స్నలు పాల్గొన్నారు.