అందమైన ముఖం కోసం వెళ్లిన నటి కొంప ముంచిన లేయర్స్ కాస్మెటిక్ క్లినిక్

by Disha Web Desk 12 |
అందమైన ముఖం కోసం వెళ్లిన నటి కొంప ముంచిన లేయర్స్ కాస్మెటిక్ క్లినిక్
X

దిశ, కూకట్‌పల్లి: రానున్న మూవీలో మరింత అందంగా కనిపించాలని కాస్మోటిక్​ట్రిట్‌మెంట్ చేయించుకుంటే.. తన అందాన్ని పాడు చేశారని, చెంపలపై సొట్ట బుగ్గలు లేకుండా చేశారని సిని నటి లతీఫా ఆరోపిస్తూ కేపీహెచ్‌బీ కాలనీలోని లేయర్స్​కాస్మోటిక్ క్లినిక్‌లో గురువారం ఆందోళనకు దిగింది. తమిళనాడుకు చెందిన సినీనటి లతీఫా గత కొన్ని సంవత్సరాలుగా కేపీహెచ్బీ కాలనీలో నివాసం ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే ధరణి ప్రొడక్షన్‌లో వచ్చిన మిస్టర్​సోల్జర్​సినిమాలో నటించిన తనకు మంచి అవకాశాలు వచ్చాయి. దీంతో త్వరలో ప్రారంభం కానున్న ప్రాజెక్ట్‌లో మరింత అందంగా కనిపించాలనుకుంది.

ఈ క్రమంలో కేపీహెచ్‌బీ కాలనీ ఫోరం మాల్ సమీపంలోని లేయర్స్ కంప్లీట్ కాస్మోటిక్ క్లినిక్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదిన ముఖానికి సంబంధించిన బొటెక్స్, ఫిల్లర్స్ వంటి కాస్మోటిక్​ట్రిట్‌మెంట్​చేయించుకున్నట్టు లతీఫా తెలిపారు. ట్రీట్‌మెంట్ చేయించుకున్న తర్వాత కొన్ని రోజులకు తన చెంపలు పూర్తిగా మారి చెంపలపై అందంగా కనిపించే సొట్ట బుగ్గులు మాయమయ్యాయని, ఆహారం తీసుకోవడానికి నోరు తెరవాలన్న నోరు తెరుచుకోకుండా విపరీతమైన నొప్పి అవుతండటంతో లతీఫా లేయర్స్ క్లినిక్ వైద్యులను సంప్రదించింది. లతీఫాకు వైద్యం అందించి డాక్టర్ కౌముది ముందు వైద్యం చేయుంకు కోవడంతో 15 రోజుల పాటు నొప్పి, కొన్ని సమస్యలు వస్తాయి మెల్లి మెల్లిగా అంతా సర్దుకుంటుందని చెప్పడంతో లతీఫా తిరిగి వెళ్లి పోయింది.

ఎంతకు నొప్పి తగ్గక పోవడంతో పాటు ముఖంలో మరిన్ని మార్పులు చోటు చేసుకున్నాయని, దీంతో తాను ఒప్పుకున్న సినిమా ప్రాజెక్టు అవకాశం క్యాన్సల్ ​అయిందని నటి వాపోయారు. లేయర్స్​వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తనకు శారీరక సమస్యతో పాటు, తన కెరీర్‌లో తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈ విషయమై లేయర్స్ సంస్థ యాజమాన్యాన్ని సంప్రదించిన ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. తనకు ముందు తిరిగి మళ్ళి వైద్యం అందిస్తామని చెప్పారు. తమ ద్వారానే తప్పు జరిగింది కాబట్టి నష్ట పరిహారం చెల్లిస్తామని చెబుతూ.. వస్తున్నారని లతీఫా ఆరోపించింది. తాను మరో వైద్యురాలి వద్దకు వెళితే లేయర్స్‌లో జరిగిన వైద్యం కారణంగా ముఖంలో మార్పులు జరిగాయని, పిల్లర్స్​వైద్యం చేసే క్రమంలో మరింత నిర్లక్ష్యం చేసి ఉంటే కంటి చూపు పోయే ప్రమాదం ఉండేదని వైద్యులు తెలిపారంది.

తన ప్రాణాలతో చెలగాటం ఆడిన లేయర్స్ కాస్మెటిక్ క్లినిక్​యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సినీ నటి లతీఫా డిమాండ్ చేశారు. తనకు వైద్యం అందించిన డాక్టర్​కౌముది డెంటిస్ట్ ​అయ్యుండి తనను తాను డెర్మటాలజిస్ట్, కాస్మోటాలజిస్ట్‌గా చెప్పుకుని తనకు వైద్యం అందించారని, లేయర్స్ క్లినిక్​పై పోలీసులకు, మెడికల్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

లతీఫాకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము: విశ్వజిత్ లేయర్స్ మేనేజింగ్​పార్ట్‌నర్

సిని నటీ లతీఫాకు సరియైన వైద్యం అందించడం జరిగింది. వైద్యంలో ఏవైన సమస్యలు ఉంటే మా వైద్యులు తిరిగి లతీఫాకు వైద్యం అందించి ఆమె ముఖంలో వచ్చిన మార్పులను సరి చేసేందుకు కృషి చేస్తాం. లేయర్స్​ప్రజా ఆదరణ ఉన్న సంస్థ, అన్యాయంగా అభాండాలు వేయకూడదని లేయర్స్​ మేనేజింగ్​ పార్ట్​నర్​ విశ్వజిత్ తెలిపారు.


Next Story