జై భారత్ నేషనల్ పార్టీకి టార్చ్ లైట్ గుర్తు కేటాయింపు

by srinivas |   ( Updated:2024-04-28 16:16:53.0  )
జై భారత్ నేషనల్ పార్టీకి టార్చ్ లైట్ గుర్తు కేటాయింపు
X

దిశ, వెబ్ డెస్క్: జై భారత్ నేషనల్ పార్టీకి ఎన్నికల సంఘం టార్చ్ లైట్ గుర్తు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర సీఈవోకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో జై భారత్ నేషనల్ పార్టీకి టార్చ్ లైట్ గుర్తును కేటాయిస్తున్నట్లు కలెక్టర్లకు సీఈవో ముఖేశ్ కుమార్ మీనా సమాచారం అందించారు. ఈ మేరకు ఆ పార్టీ గుర్తుగా టార్చ్ లైట్ గుర్తును గుర్తించాలని సూచించారు.

కాగా జై భారత్ నేషనల్ పార్టీని సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ స్థాపించారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. లక్ష్మీనారాయణ కూడా విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. దీంతో తమకు టార్చ్ లైట్ గుర్తు కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని జై భారత్ నేషనల్ పార్టీ కోరింది. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ఎన్నికల సంఘం ఆ పార్టీకి టార్చ్ లైట్ గుర్తును కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story