ఆ పనిచేశాడని తమ్ముడు పై అన్న దాడి..

by Sumithra |
ఆ పనిచేశాడని తమ్ముడు పై అన్న దాడి..
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మనపల్లి గ్రామంలో తమ్ముడు పై అన్న కత్తితో దాడి చేసిన సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు కొట్ర అర్జునయ్య అనే వ్యక్తి తన ఇంట్లో నిద్రిస్తున్నాడు.

కొట్ర అర్జునయ్య బాణామతి చేశాడని ఆరోపిస్తూ ఆ అనుమానంతో కొట్ర వేణుగోపాల్ బాధితున్ని కత్తితో ఐదు సార్లు పొడిచాడని తెలిపారు. క్షతగాత్రున్ని అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయం పై సిద్దాపూర్ ఎస్సై పవన్ కుమార్ ను దిశ ఫోన్ ద్వారా వివరణ కోరగా ఇద్దరు అన్నదమ్ములు గొడవపడ్డ విషయం తెలిసిందని, బాధితుల నుండి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆయన తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story