- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంచాయతీ సిబ్బంది మెడకు బిగుస్తున్న ఉచ్చు
దిశ, మేడ్చల్ బ్యూరో : పంచాయతీ సిబ్బంది మెడకు ‘చేతిలో నగదు’ ఉచ్చు బిగుస్తోంది. గ్రామాల్లో అత్యవసర సేవలకు ‘క్యాష్ ఇన్ హ్యాండ్ ’ ద్వారా వెచ్చించిన డబ్బులను తక్షణమే ఖజానాకు జమ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు అధికమయ్యాయి. డబ్బులు చెల్లించకుంటే శాఖ పరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు పెడుతామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నట్లు గ్రామ పంచాయితీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉద్యోగం కాపాడుకునేందుకు పంచాయతీ సిబ్బంది అప్పో సప్పో చేసి డబ్బులను చెల్లిస్తున్నారు. దీంతో మేడ్చల్ -మల్కాజ్ గిరి జిల్లాలోని ఇటీవల మున్సిపాలిటీలలో విలీనమైన 28 గ్రామాల పంచాయతీ సిబ్బంది పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది.
నిధుల లేమి..
స్థానిక సంస్థలకు నిధులివ్వకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దీనికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్పంచుల పదవీకాలం ముగియడంతో పంచాయితీల ఖజానా ఖాళీ అయ్యాయి. దీంతో గ్రామంలో అత్యవసర పనులైన సిబ్బంది వేతనాలు, నీటి సరఫరా, నిత్యం మురుగు కాల్వల శుభ్రం,వీధి దీపాల నిర్వహణ, రోడ్లు మరమ్మత్తులు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల పరిరక్షణ ,పారిశుధ్య నిర్వహణ కోసం కార్యదర్శులు తమ జేబుల నుంచి గానీ, ఇంటి పన్నుల వసూళ్లు లేదా గ్రామ పంచాయతీ రాబడి నుంచి చెల్లించాల్సి వచ్చింది. ఇలా ఇప్పటికే పలువురు కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు ఒక్కో పంచాయితీలో రూ. లక్షల్లో అత్యవసర పనుల నిమిత్తం ఖర్చు చేసినట్లు చెబుతున్నారు.
ఒత్తిడితో సతమతం..
ఇంటి పన్నులు,అనుమతులు ఇతరాత్ర మార్గాల ద్వారా వసూలు చేసిన సొమ్మును తిరిగి గ్రామ పంచాయతీ ఖజానాకు జమ చేయాలని ఒత్తిళ్లతో సిబ్బంది సతమతమవుతున్నారు. గ్రామాల్లో అత్యవసర పనుల కోసం గ్రామ పంచాయతీ తీర్మానం,ఉన్నతాధికారుల ఆమోదంతోనే ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. వీటికి సంబంధించిన బిల్లులు ఎస్టీవో లో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నాయని, ఆ బిల్లులు వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ ఖజానాకు మళ్లీంచుకోవచ్చని చెబుతున్నా.. మా గోడును ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఒత్తిడితో ఓ మహిళ కార్యదర్శి తన మంగళ సూత్రాన్ని గిరి పెట్టి డబ్బులు చేల్లించినట్లు తెలిసింది. అదేవిధంగా కొందరు కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు తెలిసిన వాళ్ల వద్ద అప్పులు తీసుకువచ్చి డబ్బులు చెల్లించినట్లు సమాచారం.
సెలవులపై వెళ్లేందుకు..
జిల్లాలోని 28 గ్రామాలు మున్సిపాలిటీలలో విలీనం చేయడంతో కార్యదర్శుల పరిస్థితి దయనీయంగా తయారైంది. విలీనం కంటే ముందు వరకు గ్రామాల్లో పూర్తి స్థాయి అధికారాన్ని కార్యదర్శులు చెలాయించారు. సమీప మున్సిపాలిటీలలో విలీనం కావడంతో కార్యదర్శుల హోదా తగ్గింది. విలీనం కంటే ముందు అన్నీ తామై వ్యవహారించిన కార్యదర్శులు కేవలం పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ఫిర్యాదుల స్వీకరణ వరకే పరిమితమయ్యారు. ఇది చాలదన్నట్లు డబ్బులు చెల్లించాలని మండల, జిల్లా కార్యాలయ అధికారులు వేధింపులు ఇటీవల ఎక్కువయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో చేసేదేమీ లేక వివిధ కారణాలు చూపుతూ కొందరు సెలవుపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా విలీన గ్రామాల పంచాయతీ సెక్రటరీల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా తయారైంది.