డాన్స్ క్లాస్‌కి వెళ్లిన మైనర్ బాలిక అదృశ్యం.. అతడిపైనే అనుమానం

by sudharani |
డాన్స్ క్లాస్‌కి వెళ్లిన మైనర్ బాలిక అదృశ్యం.. అతడిపైనే అనుమానం
X

దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి : డాన్స్ క్లాస్ కోసమని వెళ్లిన ఓ మైనర్ బాలిక అదృశ్యమైన సంఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిజన బస్తీలో జరిగింది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బోయిన్ పల్లి హరిజన బస్తీలో నివాసముంటున్న ప్రేమ్ కుమార్ కుమార్తె (15) సికింద్రాబాద్‌లోని కీస్ హై స్కూల్‌లో 15 వ తరగతి చదువుతుంది. అయితే రానున్న క్రిస్మస్ వేడుకల కోసం కొన్ని రోజులుగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది.

ఈ క్రమంలో సోమవారం డాన్స్ కోసం తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి అక్కడి నుండి చర్చికి వెళ్తానని చెప్పి ఇంటి నుండి వెళ్లింది. అయితే తన కూతురు డ్యాన్స్ క్లాస్‌కు రాలేదని చర్చి ఫాదర్ ప్రేమ్ కుమార్‌కి ఫోన్ చేసి తెలిపాడు. దీంతో ప్రేమ్ కుమార్ తెలిసిన వారిని, బంధువులను అడిగిన ఫలితం లేకపోవడంతో బోయిన్ పల్లి పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా హస్మత్ పేట్‌కు చెందిన జస్టిన్ అనే యువకుడి పైనే అనుమానం ఉన్నట్లు తండ్రి ప్రేమ్ కుమార్ ఫిర్యాదులో పేర్కోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed