- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో పని మనిషికి ఫిట్స్.. హూటాహుటిన ఆసుపత్రికి తరలింపు
దిశ, మేడ్చల్ ప్రతినిధి: కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఇంట్లో మంగళవారం ఉదయం నుండి ఐటీ రైడ్స్ జరుగుతోన్న విషయం తెలిసిందే. మల్లారెడ్డి కొడుకు, అల్లుడు, బంధువుల ఇళ్లలో సైతం ఐటీ అధికారులు ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఇప్పటికే అధికారులు భారీగా డబ్బు సీజ్ చేయడంతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజూము నుండి జరుగుతోన్న ఈ రైడ్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మంత్రి మల్లారెడ్డిపై ఐటీ రైడ్స్ జరుగుతోన్న సమయంలోనే ఆయన పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డికి చాతీలో నొప్పి రావడంతో ఐటీ అధికారులు చికిత్స నిమిత్తం సూరరాంలోని నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ఆయనకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుండగానే.. మల్లారెడ్డి ఇంట్లో పనిమనిషికి ఫిట్స్ రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే మల్లారెడ్డి దగ్గరుండి పనిమనిషిని చికిత్స నిమిత్తం హూటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మంత్రిపై ఐటీ రైడ్స్ జరుగుతోన్న వేళ ఆయన ఇంట్లో వ్యక్తులు వరుసగా అస్వస్థతకు గురి కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.