- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విలేకరుల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తప్పవు : ఏసీపీ చంద్రశేఖర్
దిశ, కూకట్పల్లి : కూకట్పల్లి ప్రాంతంలో ఇళ్లు కట్టుకునే వారు, బోర్లు వేసుకునే వారిని టార్గెట్‌గా చేసుకుని కొంత మంది నకిలి విలేఖరులు వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూకట్పల్లి ఏసీపీ ఏ.చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటణలో తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలలో ఆర్టీఐ చట్టం ద్వారా దరఖాస్తు చేసి బిల్డర్లను బ్లాక్ మేయిల్ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వరుస ఫిర్యాదులతో నిఘా పెట్టామన్నారు. నకిలి విలేఖరుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైన విలేఖరుల పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కేసునమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు.
డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కేసు నమోదు : సీఐ నరసింగరావు
కూకట్పల్లి ప్రాంతంలో నకిలి ఐడి కార్డులు చూపిస్తూ బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్టు కూకట్పల్లి సీఐ నరసింగరావు తెలిపారు. క్రైం నంబర్ 388/2023, ఐపీసీ 384 ప్రకారం నలుగురు విలేఖరుల పై కేసునమోదు చేశామని, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామని సీఐ నరసింగరావు తెలిపారు. విలేఖరుల పేరుతో లేదా అధికారుల పేరుతో డబ్బులు డిమాండ్ చేసిన, ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేసి బెదిరింపులకు పాల్పడి డబ్బులు డిమాండ్ చేసే వారిపై కూకట్పల్లి ఎస్హెచ్ఓ 9490617123 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, నకిలి విలేఖరుల పై చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ నరసింగరావు తెలిపారు.