మోదీ పాలనలో బాంబుల మోతల్లేవ్.. : ఈటల

by Aamani |
మోదీ పాలనలో బాంబుల మోతల్లేవ్.. :  ఈటల
X

దిశ ,మేడ్చల్ బ్యూరో : బస్తీల్లో నివసిస్తున్న ఓటర్లు ఓటు వేయకపోతే చచ్చిపోయినట్టే అని భావించి లైన్ లో నిలబడి ఓటు వేస్తారని, కానీ బంగ్లాలో ఉన్న వారి విశ్వాసం ఈ ప్రజాస్వామ్యం ఇంకా పొందనట్టు అనిపిస్తుందని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. కాలనీవాసులు సంపూర్ణంగా ఓటు హక్కు వినియోగించు కాకపోవడంపై ఈటల పై విధంగా స్పందించారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం, కంటోన్మెంట్ అసెంబ్లీ పరిధిలోని వెస్ట్ మారెడ్ పల్లి నెహ్రూ నగర్ పార్క్ వద్ద వాకర్స్, సీనియర్ సిటిజన్స్, వివిధ కాలనీ వారితో రాజేందర్ సమావేశమయ్యారు.

మోండా మార్కెట్ కార్పోరేటర్ దీపిక నరేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఈ సారి సంపూర్ణంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. అబ్ కీ బార్ చార్ సౌ పార్ ఇది మా పార్టీ నినాదం కానీ ఇప్పుడు ఇది దేశ ప్రజల సంకల్పం అయ్యిందన్నారు. ప్రధానిగా మూడోసారి మోదీ ని గెలిపిస్తేనే దేశం సురక్షితంగా ఉంటుంది అని భావిస్తున్నారని తెలిపారు.

నేనేంటో మీ అందరికీ తెలుసు..

కరోనా వచ్చినప్పుడు పేషెంట్ దగ్గరికి పోయిన మొదటి మంత్రిని నేనని,వ్యాక్సిన్ అందించి దేశప్రజలను కాపాడిన వారు నరేంద్ర మోడీ అని చెప్పారు. మల్కాజ్ గిరి ప్రజలు చూపిన ప్రేమకు ప్రధాని ఫిదా అయ్యారు. నాగర్ కర్నూలు, జగిత్యాల సభలో ఈ విషయం మోదీనే చెప్పారని తెలిపారు. దేశమంతా తిరిగిన ఇంత ప్రేమ ఎక్కడ చూడలేదు అని చెప్పారని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక జీతం పెంచమని ప్రాణాలు పణంగా పెట్టి పని చేసే కార్మికులు సమ్మె చేస్తే.. 1700 మందినీ కేసీఆర్ ఒక్క కలంపోటుతో డిస్మిస్ చేసారని ఆగ్రహం వ్యక్తంచేశారు.కానీ మోడీ సఫాయి కార్మికుల కాళ్లు కడిగి గౌరవించారని గుర్తు చేశారు.. ఇదే వాళ్లకు వాళ్లకు ఉన్న తేడా.. నక్కకు నాగలోకంకు ఉన్నంత తేడా అని సంబోధించారు. కరోనా సమయంలో పనిచేసిన గాంధీ ఆసుపత్రి డాక్టర్స్ సిబ్బంది మీద పూలవర్షం కురిపించారని తెలిపారు.

11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ ను 5వ స్థానంకి తెచ్చారు.. మూడవ స్థానానికి తీసుకు రావడానికి అధికారం ఇవ్వమని అడుగుతున్నారు. ప్రధాని ఎప్పడు కూడా అలవికాని హామీలు ఇవ్వలేదు.ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారి పరమావధిగా అడ్డమైన హామీలు ఇచ్చి పవర్ లోకి వచ్చారు. 2500 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తా అన్నారు. ఆర్థిక మంత్రిగా చేసిన నాకు అయితే ఎలా ఇస్తారో అర్థం కావడం లేదన్నారు.కేసీఆర్ నిరుద్యోగ భృతి కింద 3500 నెలకు ఇస్తాను అన్నారు ఇవ్వలేదు. లక్ష రుణమాఫీనే సాధ్యం కాలేదు 2 లక్షల రూపాయల రుణమాఫే ఎలా చేయగలరు.

భూములు అమ్మినా కూడా రుణమాఫీ వడ్డీలు కట్టడానికి సరిపోలేదు. హామీలు అమలు పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. ఒకే దేశం ఒకే చట్టం నినాదం ఉండే ఇది ఇప్పుడు అమలు అయ్యింది.కాశ్మీర్ కూడా ఒకే చట్టం కిందకు వచ్చింది. లాల్ చౌక్ లో మువ్వన్నెల జెండా స్వేచ్చగా ఎగురుతుంది. లుంబిని, సాయిబాబా టెంపుల్స్ బాంబుల మోతలు లేవు. రామమందిరం కట్టి భారత సంస్కృతి సంప్రదాయాలు కాపాడిన వ్యక్తి మన ప్రధాని అని తెలిపారు. బీజేపీ, నరేంద్ర మోడీ చేసిన పనులు మన కళ్ళముందు కనిపిస్తున్నాయి. అందుకే మీరు కూడా దేశ పురోగమనంలో భాగం కండి అని ఈటల రాజేందర్ పిలుపు నిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed