ఐడీఎల్​ చెరువులో వ్యర్థాల తొలగింపు పూర్తి..

by Sumithra |   ( Updated:2024-09-23 13:55:33.0  )
ఐడీఎల్​ చెరువులో వ్యర్థాల తొలగింపు పూర్తి..
X

దిశ, కూకట్​పల్లి : వినాయక నవరాత్రులు ప్రశాంతంగా ముగిసాయి. వినాయక నవరాత్రుల సందర్భంగా వినాయక మండపాల ఏర్పాటు నుంచి గణనాథులు నిమజ్జనానికి తరలించడం, నిమజ్జన ఘట్టాలను విజయవంతం చేయడంలో జీహెచ్​ఎంసీ, పోలీసు శాఖ, జలమండలి, విద్యుత్​ శాఖ, ఆర్​ అండ్​ బీ శాఖ అధికారులు ఎంతో శ్రమించారు. నిమజ్జన ఘట్టం పూర్తి అయిన తరువాత వ్యర్థాల తొలగింపు జీహెచ్​ఎంసీ అధికారులకు పెద్ద టాస్క్​గా మారింది. సుమారు ఐడీఎల్​ చెరువు కట్ట పై నిమజ్జన ఏర్పాట్లు, నిమజ్జనం అనంతరం వ్యర్థాల తొలగింపు పనులకు 25 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు, ఐడీఎల్​ చెరువులో 13 రోజుల వరకు మొత్తం 9 వేలు మూడు ఫీట్ల కంటే పెద్దవి, 22 వేల మూడు ఫీట్లకంటే చిన్న విగ్రహాలు మొత్తం సుమారు 31 వేల విగ్రహాలు నిమజ్జనం జరిగినట్టు ట్రాన్స్​ పోర్ట్​ విభాగం ఇన్చార్జి, ఇంజనీరింగ్​ విభాగం ఏఈ రంజిత్​ తెలిపారు.

వ్యర్థాల తొలగింపు..

ఐడీఎల్​ చెరువులో నిమజ్జనం అనంతరం 14 నుంచి 15 మెట్రిక్​ టన్నుల పీఓపీ, 1 టన్​ ఇనుమును బయటికి తీశారు. ఐడీఎల్​ చెరువు కట్ట పై నిమజ్జనం నుంచి వ్యర్థాల తొలగింపు వరకు పారిశుధ్య విభాగం సిబ్బందికి చెందిన 60 మంది కార్మికులు మూడు షిఫ్ట్​ల ప్రకారం పని చేశారు. నిమజ్జనం కోసం 7 క్రేన్​లను ఏర్పాటు చేయగా అందుకు గాను 60 మంది సిబ్బంది పని చేశారు. అదే విధంగా వ్యర్థల తొలగింపు కోసం 3 ఇటాచిలు, 8 టిప్పర్​లను వినియోగించారు. అదే విధంగా నిమజ్జన కొలనులోని వ్యర్థాలను తొలగించి నీటిని తోడి కొలనును పూర్తిగా శుభ్రం చేశారు.

ఐడీఎల్​ చెరువులో వ్యర్థల తొలగింపు పూర్తయింది : రంజిత్​ కుమార్​, ఏఈ, మూసాపేట్​ సర్కిల్..​.

కూకట్​పల్లి జోనల్​ కమిషనర్​ అపూర్వ్​ చౌహాన్​, డీసీ రమేష్​, ఈఈ శ్రీనివాస్​ రావు, డీఈ ఆనంద్​, డీఈ శ్రీదేవిల నేతృత్వంలో వినాయక నిమజ్జనం, వ్యర్థాల తొలగిపు పనులు పూర్తయ్యాయి. నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడంలో జీహెచ్​ఎంసీ సఫలీకృతం అయింది. చెరువులో వ్యర్థాలతో పాటు, కొలనులో వ్యర్థాలను తొలగించి కొలనును శుభ్రం చేసి వ్యర్థాలను డంపింగ్​ యార్డుకు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed