- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు మావే.. : ఈటల
దిశ,మేడ్చల్ బ్యూరో : తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎప్పుడు పెట్టిన వాడని, అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కాయ్ అని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. శుక్రవారం సాయంత్రం మల్కాజిగిరి లో ప్రధానమంత్రి మోడీ రోడ్ షో చేయనున్న నేపథ్యంలో ఆయన గురువారం ఆనంద్ బాగ్ లో విలేకరులతో మాట్లాడారు. గత పది సంవత్సరాల కాలంలో దేశంలో జరిగిన అభివృద్ధి గురించి ఆయన చెప్పుకొచ్చారు. టాయిలెట్స్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ అని, ఆయన రాకముందు దేశంలో రోజుకు 11 కిలోమీటర్ల మీద నేషనల్ హైవేలు నిర్మించారని కానీ, అది ప్రస్తుతం రోజుకు 28 కిలోమీటర్ల మేర పెరిగి జాతీయ రహదారులు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.
2014 తన ముందు దేశంలో 75 విమానాశ్రయాలు ఉంటే ఇప్పుడు అవి 150 కి చేరాయని అన్నారు. దేశం సురక్షితంగా ఉండాలన్న, ఆర్థిక వ్యవస్థలో మూడో స్థానానికి రావాలని, బాంబుల మూతలు లేకుండా ఉండాలంటే కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం రావాలని పేర్కొన్నారు. శతాబ్దాలుగా నెరవేరని రామమందిర నిర్మాణాన్ని మోదీ నాయకత్వంలో చేపట్టి పూర్తి చేయడమే కాకుండా జాతికి అంకితం చేశారని తెలిపారు. ఇప్పటివరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలలో ఎంపీగా పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదని, వారు డబ్బున్న అభ్యర్థుల కోసం ఇంకా వెతుకులాడు తూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. మిర్జాల కూడా చౌరస్తా నుంచి సాయంత్రం నాలుగు గంటలకు మోడీ రోడ్ షో ప్రారంభమై మల్కాజిగిరి చౌరస్తా వరకు కొనసాగుతుందని బీజేపీ కార్యకర్తలు అభిమానులు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.