- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు పతకాలు..
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 281మంది అధికారులకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రకటించిన పతకాలను నేడు గ్రహీతలకు అంద చేయనున్నారు. రవీంద్రభారతిలో జరుగనున్న కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మహమూద్‌అలీ, డీజీపీ అంజనీ కుమార్ఈ పతకాలను ప్రదానం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల మాదిరిగా రాష్ర్ట ప్రభుత్వం కూడా విధుల నిర్వర్తనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు కొన్నేళ్లుగా పతకాలు, అవార్డులు అందచేస్తున్న విషయం తెలిసిందే. ఈసారి అతి ఉత్కృష్ట సేవా పతకాలు 30 మంది పోలీసు అధికారులకు ఇవ్వనున్నారు.
అదేవిధంగా ఉత్కృష్ట పతకాలు 28, అసాధరణ అసూచన కుశలతత పథకాలను 7గురికి ప్రదానం చేస్తారు. పరిశోధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను కేంద్ర హోంమంత్రి పతకాలు 11మందికి, శౌర్య పతకాలు 11మందికి, మహోన్నత సేవా పతకాలు 7గురికి అందచేయనున్నారు. ఇక, రాష్ర్ట ప్రభుత్వం తరఫున ఉత్తమ సేవా పతకాలు 84మందికి, ఆంత్రిక్సురక్షా సేవా పతకాలు 67మందికి, ఆంత్రిక్సురక్షా సేవా పతకాలను 28మంది పోలీసు అధికారులకు ఇవ్వనున్నారు.
పతకాలను అందుకోనున్న వారిలో డీజీపీ అంజనీ కుమార్‌తోపాటు ఇద్దరు అదనపు డీజీలు, ఇద్దరు ఐజీలు, ఓ డీఐజీ, ఇద్దరు ఎస్పీలు, ఇద్దరు అదనపు ఎస్పీలు అయిదుగురు, డీఎస్పీలు ఇరవై రెండు మంది ఉన్నారు. వీరితోపాటు 39మంది ఇన్స్పెక్టర్లు, యాభై ఏడుమంది సబ్ఇన్స్పెక్టర్లు, ముప్పయి ఒక్కమంది ఏఎస్సైలు, ఇరవై రెండు మంది హెడ్‌కానిస్టేబుళ్లు, తొంభై ఆరుమంది కానిస్టేబుళ్లు కూడా పతకాలు అందుకోనున్నారు.