జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సురేష్ షెట్కార్

by Naresh |   ( Updated:2024-03-08 16:14:38.0  )
జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సురేష్ షెట్కార్
X

దిశ, నారాయణఖేడ్: అందరూ ఊహించినట్లుగానే జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సురేష్ షెట్కార్ ను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. మొదటి జాబితాలోనే సురేష్ షెట్కర్ పేరు రావడంతో ఆయన సన్నిహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2004లో మొదటి సారిగా నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి సురేష్ షెట్కర్ ఎన్నికయ్యారు.1999 నుంచి చెరో అయిదేళ్ల పాటు గెలుపు కోసం పరస్పరం సహకరించుకోవాలని సురేష్ షెట్కార్, కిష్టారెడ్డిల మధ్య ఒప్పందంతో గెలిచిన షెట్కార్ 2009లో కిష్టారెడ్డికి ఒప్పందం ప్రకారం అవకాశం కల్పించారు. షెట్కర్ ఎమ్మెల్యే స్థానం పైన ఆసక్తిని కనబర్చారు.

పట్లోళ్ల కిష్టారెడ్డిని ఎంపీగా పోటీ చేయాలని కోరగా... ఆయన సైతం ఎమ్మెల్యే స్థానం పైనే ఆసక్తిని కనబర్చారు. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఇద్దరి మధ్య ఢీ అంటే ఢీ అనే పరిస్థితులు నెలకొన్నాయి. నారాయణఖేడ్ పరిస్థితులపై అవగాహన కలిగిన మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్లోళ్ల కిష్టారెడ్డికి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. జహీరాబాద్ ఎంపి స్థానానికి ఆలే నరేంద్ర, ఫరీదుద్దినులతో పాటు పలువురు ఆసక్తి కబపర్చినా.. వారిని కాదని సురేష్ షెట్కార్ పేరును ఖరారు చేశారు. దీంతో షెట్కార్ అయిష్టతతోనే బరిలో దిగారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధి జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలు ఉండగా, అప్పటి నిజాంబాద్ జిల్లా పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉండటమే అయిష్టతకు కారణం.

ప్రధానంగా నిజాంబాద్ జిల్లా పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాలపై షెట్కర్ ఎక్కువ దృష్టి పెట్టగా మెదక్ జిల్లా పరిధిలోని మూడు స్థానాల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులతో పాటు సోదరుడు నగేష్ షెట్కర్ గెలుపు కోసం గట్టి కృషి చేశారు. నిజాంబాద్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలలోనూ మహాకూటమి అభ్యర్థులు గెలిచారు.

ఉద్యమ ప్రస్థానం నేపథ్యంలో పరిశీలించిన అధిష్టానం…

నారాయణఖేడ్ నియోజకవర్గంలో లింగాయత్ ఓట్లు 30 వేల పైనే ఉన్నాయి. దాదాపు పార్లమెంట్ నియోజకవర్గంలో జహీరాబాద్ నియోజకవర్గంలో కూడా 40 వేల ఓట్లు ఉంటాయి. దీంతో ఐదు నియోజకవర్గంలో లింగాయత్ ఓట్లు బలము కలిగిన ఉన్న నేపథ్యంలో అదే వర్గానికి చెందిన సురేష్ షెట్కర్‌ను కాంగ్రెస్ పార్టీ పరిశీలించి టికెట్ ఖరారు చేసింది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్న సమయంలో లింగాయత్ లను బీసీల జాబితాలో చేర్చారు. అప్పుడు కాంగ్రెస్‌లో పెద్ద నాయకులు ఉన్నప్పటికీ సురేష్ షెట్కార్ కృషి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు.

గెలుపు పొందె వరకూ.. అలుపు లేదు తనకు..

ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక్కొక్కసారి గెలిచారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉండి బీఆర్ఎస్ అవినీతిని ఎండగడుతూ కార్యకర్తల్లో ఉత్సహాన్ని నింపారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతో కీలకపాత్ర పోషించి ప్రజల పక్షాన నిలిచారు. ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు.

నిర్వర్తించిన పదవులు..

1991-1998 ఉమ్మడి మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు,

2002-2008 మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు,

2004-2009 ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుడిగా పనిచేశారు.

2009-2014-15లో ఎంపీగా గెలుపొందారు. 2009 - 2014 రసాయనాలు, ఎరువుల కమిటీ సభ్యుడిగా పనిచేశారు.

సురేష్ షెట్కార్ తండ్రి శివ రావు షెట్కర్ అనుచరుడైన పట్లోళ్ల కిష్టారెడ్డి ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. దీంతో సురేష్ 2004లో స్వతంత్రంగా పోటీ చేసి మొదటిసారి నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున జహీరాబాద్ లోక్ సభకు పోటీ చేసి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి సయ్యద్ యూసుఫ్ అలీ పై 17,407 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2024 శాసనసభ ఎన్నికల్లో నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించినప్పటికీ తానే పట్లోళ్ల సంజీవరెడ్డికి టికెట్ ఇచ్చి గెలిపించారు. పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తించి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed