- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువత స్వయం ఉపాధి రంగాల వైపు దృష్టి సారించాలి : ఎమ్మెల్సీ యాదవరెడ్డి
దిశ, జగదేవపూర్: గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి రంగాల వైపు దృష్టి సారించాలని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. శుక్రవారం జగదేవపూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన లెజెండరీ బ్రాండ్ బట్టల షాపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువకులు స్వయం ఉపాధి పై దృష్టి సారించి, ఎవరికి నచ్చిన రంగాన్ని వారు ఎంచుకొని ఆర్థికంగా రాణించాలని సూచించారు. నిరుద్యోగ యువకులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 80 వేలకు పైగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు తెలిపారు.
ప్రతాప్ రెడ్డి పరామర్శ ..
ఇటిక్యాల గ్రామానికి చెందిన శ్రీపతి రమేష్ ఆనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. శుక్రవారం మృతుని కుటుంబ సభ్యులను ప్రతాప్ రెడ్డి పరామర్శించి 5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్, పీఎసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, జగదేవపూర్ మాజీ సర్పంచ్ కొంపల్లి కరుణాకర్, బుద్ధ సత్యం ఉన్నారు.