సంగారెడ్డి పట్టణంలో యువతి అదృశ్యం.. ఫిర్యాదు చేసిన తల్లి

by Disha daily Web Desk |
సంగారెడ్డి పట్టణంలో యువతి అదృశ్యం.. ఫిర్యాదు చేసిన తల్లి
X

దిశ, కంది : సంగారెడ్డి పట్టణంలో ఓ యువతి అదృశ్యమైంది. సంగారెడ్డి పట్టణ సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుంటకు చెందిన నర్సగళ్ళ ప్రవళిక (23) ఈ నెల 17న సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. అయితే ఇప్పటివరకు ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో యువతి తల్లి ఆండాలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆచూకీ తెలిసినవారు 9490617010 లేదా 08455-276333 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సీఐ సూచించారు.

Advertisement

Next Story