- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా
దిశ, మద్దూరు: మండల పరిధిలోని నర్సాయపల్లి గ్రామానికి చెందిన బద్దిపడగ శ్రీనివాస్ రెడ్డి మాజీ సైనికుడు, బీజేపీ సైనిక విభాగం జిల్లా అధ్యక్షుడు. భార్యను కాపురానికి తీసుకువెళ్లకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని భార్య బద్దిపడగ అంజలి తన కుమారునితో కలిసి ఇంటి ఎదుట బుధవరాం ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ నర్సాయపల్లి గ్రామానికి చెందిన బద్దిపడగ శ్రీనివాస రెడ్డితో ఐదేళ్ల క్రితం వివాహమైందని, ఓ సంవత్సరం నుంచి అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తూ కాపురానికి తీసుకువెళ్లడం లేదని అంజలి ఆవేదన వ్యక్తం చేసింది.
పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకు ఉద్యోగరీత్య శ్రీనివాస్ రెడ్డి లక్నోకి వెళ్లిపోయాడు. దీంతో వాళ్ల అమ్మ, నాన్న, అన్న, వదిన తనను వేధింపులకు గురి చేస్తూ తన అమ్మ గారి ఊరైన సిద్దిపేట జిల్లా రామాయంపేటకి పంపించారని తెలిపింది. భర్త శ్రీనివాస్ రెడ్డి విధులు ముగించుకుని తన స్వగ్రామం నర్సయపల్లికి వచ్చిన వెంటనే అత్త వారింటికి తీసుకెళ్లాడని, తిరిగి వారం రోజుల నుంచి తన భర్త వాళ్ల అమ్మ, నాన్నల మాట విని వేధింపులకు గురిచేశాడని ఆరోపించింది. తాను ప్రెగ్నెంట్ అయితే.. తన వల్లే కడపు రాలేదంటూ అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడికి గురి చేస్తున్నాడని తెలిపింది.
వేధింపులు తాళలేక సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో 2020, ఫిబ్రవరి నెలలో ఫిర్యాదు చేశానని తెలిపింది. ఈ విషయంలో శ్రీనివాస్ రెడ్డిని సఖీ కేంద్రానికి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన తనలో మార్పు రావడం లేదని అదనపు కట్నం తీసుకొస్తేనే కాపురానికి తీసుకెళ్తానని అంటున్నాడని తెలిపింది. లేదంటే విడాకులు ఇస్తానని బెదిరిస్తూ.. తన కుటుంబ సభ్యులు, తనపై దాడి చేశారని తెలిపింది.
దీంతో తనను కాపురానికి తీసుకెళ్లాలంటూ అంజలి భర్త ఇంటి ఎదుట ధర్నా చేపట్టింది. తనను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్న భర్త శ్రీనివాస్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని, తన భర్త శ్రీనివాస్ రెడ్డి తన అన్నకు ఇచ్చిన ఆస్తిని తన పేరు మీద, తన కొడుకు పేరు మీద బదిలీ చేయాలని డిమాండ్ చేస్తోంది.